Breaking News

ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

Published on Thu, 01/22/2026 - 15:44

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం రేగింది. న్యూసౌత్‌ వేల్స్‌లోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. బాండీ బీచ్‌ దాడి ఘటన జరిగిన నెల రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 1500 మంది జనాభా ఉన్న ఈ పట్టణంలోని వాల్కర్ వీధిలోని ఒక నివాస ప్రాంతంలో సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ అధికారులు వెల్లడించారు.

తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగులు పరారీలో ఉండటంతో.. ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నందున స్థానికులు ఇళ్లలోనే ఉండాలని పోలీస్‌ అధికారులు సూచించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే సెంట్రల్ వెస్ట్ పోలీస్, క్రైమ్ స్టాపర్స్‌ (1800 333 000) నంబర్‌కు కాల్‌ చేయాలని కోరారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)