Breaking News

హసన్‌ నస్రల్లాకు కన్నీటి వీడ్కోలు

Published on Mon, 02/24/2025 - 05:26

బీరూట్‌:  లెబనాన్‌ మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’దివంగత అధినేత హసన్‌ నస్రల్లాకు వేలాది మంది అభిమానులు తుది వీడ్కోలు పలికారు. గత ఏడాది సెపె్టంబర్‌లో బీరూట్‌ శివారు ప్రాంతంలో ఇజ్రాయెల్‌ సైన్యం దాడిలో మరణించిన నస్రల్లా  అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అభిమాన నేతకు నివాళులర్పించడానికి వేలాది మంది తరలివచ్చారు. నస్రల్లా పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం లెబనాన్‌ రాజధాని బీరూట్‌లోని కెమిల్లీచామౌన్‌  స్పోర్ట్స్‌ సిటీ స్టేడియంలో ఉంచారు. 

ఈ సందర్భంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ పంపించిన సందేశాన్ని చదివి వినిపించారు. స్టేడియంలో నస్రల్లా మృతదేహంతోపాటు ఆయన ప్రధాన అనుచరుడు హషీం సఫీద్దీన్‌ మృతదేహాన్ని కూడా జనం దర్శించుకున్నారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడిలో సఫీద్దీన్‌ మరణించారు.

 ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇరువురి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హెజ్బొల్లా అగ్రనేత నయీమ్‌ ఖాషీం టీవీలో ప్రసంగించారు. నస్రల్లా చూపిన మార్గంలో నడుస్తామని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు. అంత్యక్రియల సందర్భంగా బీరూట్‌ నగరంలో అడుగడుగునా నస్రల్లా చిత్రపటాలు ఏర్పాటు చేశారు. నగరంలో విషాద వాతావరణం కనిపించింది. విదేశాల నుంచి సైతం అభిమానులు హాజరయ్యారు. 
 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)