Breaking News

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ‍్రవాది మసూద్‌ అజార్‌ ‘జాడ’ కనిపెట్టేశారు..!

Published on Fri, 07/18/2025 - 15:27

కరాచీ:  గ్లోబల్‌ టెర్రరిస్టు, భారత మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు మసూద్‌ అజార్‌ తమ దేశంలో లేడని బుకాయిస్తు వస్తున్న పాకిస్తాన్‌ దొంగ బుద్ధి మరోసారి బయటపడింది. పాక్‌ చెబుతున్నది ఎంతమాత్రం నిజం కాదనే విషయాన్ని భారత ఇంటెలిజెన్స్‌ వర్గాలు తేటతెల్లం చేశాయి. మసూద్‌ అజార్‌ పాక్‌లో ఉన్న విషయాన్ని భారత్‌ ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పసిగట్టేశాయి. 

పీవోకే(పాక్‌ ఆక్రమిత కశ్మర్‌) పరిధిలో గిల్జిట్‌ బాలిస్తాన్‌ ప్రాంతంలో మసూద్‌ సంచరించిన విషయాన్ని తాజాగా వెల్లడించాయి. మసూద్‌ అజార్‌ కదలికల్ని అత్యంత దగ్గరగా నిశితంగా పరిశీలిస్తున్న భారత్‌ ఇంటెలిజెన్స్‌..  బహవల్పూర్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో మసూద్‌ నివాస జాడలు ఉన్నట్లు తెలిపింది.  ఇటీవల మసూజ్‌ అజాయర్‌ స్కర్దూ, సద్‌పారా ఏరియాల్లో కనిపించిన విషయాన్ని కూడా ఇంటెలిజెన్స్‌ స్పష్టం చేసింది. అక్కడ ప్రధానంగా పలు ప్రైవేటు, గవర్నమెంట్‌ గెస్ట్‌ హౌస్‌ల్లో మసూద్‌ కనిపించాడు. 

కాగా,  ఇటీవల ఆల్‌ అజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ మాజీ విదేశాంగ మంత్రి బిల్వాల్‌ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. మసూద్‌ అజార్‌ తమ దేశంలో లేడంటూ చెప్పుకొచ్చారు. ఒకవేళ పాకిస్తాన్‌లో ఉన్నాడని భారత్‌ సమాచారం ఇస్తే తాము సంతోషంగా అతన్ని అరెస్ట్‌ చేస్తామని కూడా బుకాయించే యత్నం చేశారు. ఇప్పుడు పాకిస్తాన్‌లోనే అజార్‌ ఉన్నాడని భారత ఇంటెలిజెన్స్‌ స్పష్టం చేసిన తరుణంలో  బిల్వాల భుట్టో ఏమంటాడో చూడాలి

భారత్‌లో ఉగ్రదాడులకు సూత్రధారి
భారత్‌లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్‌ అజార్‌ది కీలక పాత్ర. 2016లో పఠాన్‌కోట్‌లో ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్‌ అజార్‌ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్‌ మోస్గ్‌ వాంటెడ్‌ ఉగ్రవాదిగా మసూద్‌ అజార్‌ ఉన్నాడు.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)