Breaking News

అమెరికాలో కొత్తరకం వ్యాధి! 

Published on Wed, 08/27/2025 - 06:32

మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీలాండ్‌లో ఓ వ్యక్తి ఈ నెల 4వ తేదీన దీనిబారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని న్యూవరల్డ్‌ స్రూ్కవార్మ్‌(ఎన్‌డబ్ల్యూఎస్‌) మియాసిస్‌ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ(మగ్గోట్స్‌) లార్వా మనిషి శరీరంలోని కణజాలంలో తిష్టవేసి, క్రమంగా మాంసాన్ని భక్షిస్తుందని అంటున్నారు. ఎల్‌సాల్వెడార్‌ దేశం నుంచి వ్యక్తికి వ్యాధి సోకినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, ప్రివెన్షన్‌(సీడీసీ) సహకారంతో తొలి కేసును నిర్ధారించినట్లు యూఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హెల్త్, హ్యూమన్‌ సర్విసెస్‌(హెచ్‌హెచ్‌ఎస్‌) తెలియజేసింది.  

→ ఎన్‌డబ్ల్యూఎస్‌ మియాసిస్‌ అనేది సాధారణంగా పాడి పశువులు, ఇతర జంతువుల్లో కనిపిస్తుంది. దక్షిణ అమెరికాతోపాటు కరీబియన్‌ దీవుల్లో దీని ఉనికి ఉంటుంది. కానీ, ఇటీవల సెంట్రల్‌ అమెరికా, మెక్సికోతోపాటు అమెరికాకు సైతం విస్తరించినట్లు నిపుణులు గుర్తించారు.  

→ ప్రధానంగా శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నవారికి ఎన్‌డబ్ల్యూఎస్‌ మియాసిస్‌ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీని ప్రభావానికి గురైన పశువులకు, ప్రాంతాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.  

→ కొక్లియోమియా హోమినివోరక్స్‌ ఈగ లార్వాలే ఈ స్రూ్కవారŠమ్స్‌. జంతువుల పుండ్లు, గాయాలపై వాలుతుంటాయి. పుండు భాగంలో లేదా సున్నితమైన కణజాలంపై ఒక ఆడ ఈగ ఒకేసారి 300 వరకు గుడ్లు పెట్టగలదు.  

→ గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలు పుండ్ల లోపలికి చొచ్చుకెళ్తాయి. క్రమంగా మాంసాన్ని తినేస్తాయి. తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది.  

→ లార్వాలు మూడు నుంచి ఐదు రోజుల్లో పుండు నుంచి బయటకు వచ్చి కిందపడిపోతాయి. భూమి కిందిభాగంలోకి చేరుకుంటాయి. ఈగలుగా మారి బయటకు వస్తాయి. గుడ్లు పెట్టడానికి పుండ్లు, గాయాలు ఉన్న జంతువులను వెతుక్కుంటాయి.  

→ కొక్లియోమియా హోమినివోరక్స్‌ ఈగ జీవితకాలం దాదాపు 30 రోజులు. మొత్తం జీవితకాలంలో 3,000కుపైగా గుడ్లు పెడతాయి.  

→ న్యూవరల్డ్‌ స్రూ్కవార్మ్‌ మియాసిస్‌ వల్ల మనుషులకు ముప్పు తక్కువేనని అమెరికా వైద్యులు చెబుతున్నారు. దేశంలో ఈ ఏడాది జంతువులకు ఈ పరాన్నజీవి సోకలేదు.  

→ ఒకసారి సోకితే ఆ ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థతో కలిసి పని చేస్తున్నారు.  

→ ఈగలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టెక్సాస్‌లో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఈగల్లో సంతానాన్ని అరికట్టడానికి ఈగలనే ప్రయోగిస్తారు. స్టెరిలైజ్‌ చేసిన మగ ఈగలు ఆడ ఈగలతో కలిస్తే.. ఆ ఆడ ఈగల్లో సంతాన సామర్థ్యం క్షీణిస్తుంది.  

→ మనుషులు గాయాలు, పుండ్లు బయటకు కనిపించకుండా జాగ్రత్తపడితే ఈగల బారినపడే అవకాశాలు ఉండవు. గాయాలకు సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి.   
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)