Breaking News

ఒక్కరోజు పెళ్లికి లెక్కలేనంత డిమాండ్‌.. ఆనక వధువు ఏంచేస్తుందంటే..

Published on Mon, 08/14/2023 - 12:38

జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  పెళ్లయిన వారిని సెటిల్‌ అయ్యారని కూడా అంటుంటారు. అయితే పెళ్లి విషయంలో వివిధ దేశాల్లో పలు రకాలైన సంప్రదాయాలున్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకలు రోజుల తరబడి కూడా జరుగుతుంటాయి. అయితే ఆ దేశంలో పెళ్లి వేడుక అన్ని ప్రాంతాలకన్నా భిన్నంగా జరుగుతుంది. అక్కడ యువకులు ఒక్కరోజు కోసం పెళ్లికొడుకులుగా మారతారు. అమ్మాయి కూడా ఒక్కరోజు కోసం వధువుగా మారుతుంది. ఇంతకీ ఇలాంటి వింత వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పూర్తి వివరాలు..

ఇటువంటి వింత వివాహం చైనాలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి విధానం లేదు. తాజాగా ఒ‍క్కరోజు కోసమే ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లేమీ జరగవు. సాదాసీదాగా, రహస్యంగా ఈ వివాహాలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా చైనాలో ఇటువంటి వివాహాల తంతు పెరిగిపోయింది. 

ఈమధ్య కాలంలొ చైనాలలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టదాయకంగా మారింది. పెళ్లికి అత్యధికంగా సొమ్ము ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా ‍పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒకరోజు పెళ్లికి సిద్దం అవుతున్నారు. తద్వారా తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు. 

ఇటీవలి కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరట భారీ వ్యాపారం జరుగుతోంది. పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్‌ పెరుగుతోంది. 
ఇది కూడా చదవండి: ‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి..

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)