Breaking News

అమెరికా ఆర్మీ క్యాంపుల్లో కొందరు నేరగాళ్లు

Published on Wed, 07/12/2023 - 08:49

అమెరికాలోని శాన్ డియాగోలోగల మెరైన్ కార్ప్స్ బేస్ క్యాంప్ పెండిల్‌టన్‌లోని బ్యారక్స్‌లో గతంలో తప్పిపోయిన 14 ఏళ్ల బాలిక ఆచూకీ లభ్యం కావడంతో ఒక యూఎస్‌ మెరైన్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బాధిత బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆ బాలికను ఎవరో అక్రమంగా విక్రయించారని, ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. 

శాన్ డియాగో కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మతిస్థిమితం లేని ఒక బాలిక జూన్ 9 న ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయి, ఇంటికి తిరిగి రాలేదని జూన్ 13 న ఆ బాలిక అమ్మమ్మ పోలీసుకు ఫిర్యాదు చేసింది. కాగా ఆబాలిక అదృశ్యమైన 20 రోజుల తర్వాత జూన్ 28న మిలటరీ పోలీసులు ఆమెను బ్యారక్స్ లోపల కనుగొన్నారని ఆమె అత్త కాసౌండ్రా పెరెజ్ తెలిపారు. ‘ఆ బాలిక ఆచూకీ మిలటరీ పోలీసులకు బ్యారక్‌లో లభ్యమయ్యింది. లైంగిక కార్యకలాపాల కోసం ఆమెను ఎవరో సైనికునికి విక్రయించారు’ అని పెరెజ్  టిక్‌టాక్ వీడియోలో తెలిపారు. 

మెరైన్ బేస్ క్యాంప్‌లో బాలిక ఉందని షెరీఫ్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించింది. కాగా ఆ బాలిక గతంలోనూ ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోయేదని, అయితే త్వరగా ఇంటికి తిరిగి వచ్చేదని ఆమె అమ్మమ్మ మీడియాకు తెలిపారు. నేవల్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ సర్వీస్ కు చెందిన షెరీఫ్ విభాగం, శాన్ డియాగో హ్యూమన్ ట్రాఫికింగ్ టాస్క్ ఫోర్స్ సాయంతో ఈ  కేసు దర్యాప్తు చేపట్టింది. కంబాట్ లాజిస్టిక్స్ బెటాలియన్ 5, 1వ మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్‌లో సభ్యుడైన ఒక మెరైన్‌ను జూన్ 28న ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్‌ కెప్టెన్ చక్ పామర్ తెలిపారు. కాగా పేరు వెల్లడికాని ఆ మెరైన్‌పై ఇంకా  అభియోగాలు మోపలేదు.  మెరైన్ కార్ప్స్‌ చేతికి సంకెళ్లి వేసి పోలీసులు తీసుకెళ్లిన ఫోటో ఇలీవల సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. కాగా తన మేనకోడలిపై జరిగిన అత్యాచారాన్ని సైన్యం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని పెరెజ్ ఆరోపించారు. 

ఈ ఘటనకు బేస్ క్యాంప్‌దే బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. వారే ఆ బాలికను బేస్‌లోకి తీసుకురావడానికి అనుమతించారు. అక్కడ అతను ఆమెతో లైంగిక సంబంధం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉన్నందున అడ్డుకోలేకపోయిందని  పెరెజ్ అన్నారు. కాగా అధికారులు ఆ బాలికను ఆమె అమ్మమ్మకు అప్పగించారు.
ఇది  కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు 

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)