Breaking News

అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్‌’.. బాంబు దాడి కలకలం

Published on Mon, 06/02/2025 - 07:33

వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో(Colorado)లో కలకలం చెలరేగింది. ఇక్కడి బౌల్డర్‌లో చోటుచేసుకున్న దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(ఎఫ్‌బీఐ)డైరెక్టర్‌ కాష్ పటేల్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.

ఎప్‌బీఐ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బెన్ విలియమ్సన్ సోషల్ మీడియా సైట్  ‘ఎక్స్‌’లో  ఈ విషయాన్ని తెలియజేస్తూ నిందితుడు యూదులపై బాంబులు విసురుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అని అరిచాడని తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వీజర్ మాట్లాడుతూ  ఈ ఘటనలో కొందరిని లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తున్నదన్నారు. కాగా నిందితుడిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాగా ఎప్‌బీఐ గుర్తించింది.

ఈ ఘటనపై బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్‌ఫెర్న్ మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ బందీలను  గుర్తుచేసుకుంటూ ప్రదర్శన జరుగుతుండగా, దానికి సమీపంలోనే ఈ దాడి జరిగిందన్నారు. గాజా- ఇజ్రాయెల్ యుద్ధం నేపధ్యంలో అమెరికాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఇజ్రాయెల్(Israel) మద్దతుదారులు.. ఈ పాలస్తీనా అనుకూల నిరసనలను యూదు వ్యతిరేక నిరసనలుగా పేర్కొంటున్నారు.
 

బౌల్డర్‌లో జరిగిన ఘటనను చూసిన కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన 19 ఏళ్ల బ్రూక్ కాఫ్‌మన్ మాట్లాడుతూ, దాడి జరిగిన సమయంలో నలుగురు మహిళలు కాలిన గాయాలతో  బాధపడుతుండటాన్ని చూశానని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ప్రాంగణంలో చొక్కా లేకుండా నిలుచుని, ఏదో  ద్రవం ఉన్న గాజు సీసాలను పట్టుకుని అరిచాడని ఆమె వివరించారు. కాగా ప్రముఖ యూదు డెమొక్రాట్, సెనేట్ మైనారిటీ నేత చక్ షుమెర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఇది కూడా చదవండి: బీహార్‌ ఎన్నికల్లో చిరాగ్‌ పాశ్వాన్‌ పోటీ

#

Tags : 1

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)