Breaking News

హెయిర్ కటింగ్‌కు రూ.230..చెల్లించింది.. రూ.1.15 లక్షలు.. ఏమైందంటే..?

Published on Tue, 06/13/2023 - 16:19

టెక్నాలజీ పెరిగేకొద్దీ మోసాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. రోజురోజుకు చాలా విచిత్రమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అమాయకులే ప్రధాన అజెండాగా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. చైనాలో ఓ వ్యక్తి మోసపోయిన తీరు చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అంతా.. నాటకీయంగా అనిపించినప్పటికీ ఓ వ్యక్తి  హెయిర్ కటింగ్‌కు రూ.230 చెల్లించడానికి రూ.1.15 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంతకూ అతడెలా మోసపోయాడో చదివేయండి..

బీజింగ్‌కు చెందిన ఈ వ్యక్తి పేరు లీ. ఇతనికి ఓ హెయిర్ సెలూన్‌ నుంచి రూ.230 గిఫ్ట్ కార్డ్‌ వచ్చింది. దానిని వాడుకోవడానికి సెలూన్‌కు వెళ్లాడు. కార్డు చూపించగానే హెడ్ మసాజ్ చేశారు సెలూన్‌ నిర్వహకులు. అనంతరం లీ ముఖానికి లోషన్‌ను పూశారు. లోషన్ బాటిల్ ఖరీదు రూ.4,582గా బిల్లును చూపించారు. రూ.57,571 ఖరీదైన మరో కూపన్‌ను కొనుగోలు చేసేలా లీని సలూన్ మేనేజర్ ప్రోత్సహించారు.

హెయిర్‌ కట్ చేసే ముందు లీకి బిల్‌ను చూపించారు. కానీ కళ్లద్దాలు పెట్టుకోనందున లీ దాన్ని చూడలేకపోయారు. ఎయిర్ కట్ అనంతరం లీకి అసలు విషయం అర్ధమైంది. రూ.1.15లక్షల బిల్‌ చెల్లించాల్సిందిగా సెలూన్ యాజమాన్యం అతనిపై ఒత్తిడి చేసింది. డబ్బులు లేవన లీ చెప్పగా.. సెల్‌ఫోన్ ద్వారా లోన్‌కు అప్లై చేసేలా ఒత్తిడి చేశారు. చేసేదేమీ లేక లీ లోన్‌ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. 

మోసపోయానని తెలుసుకున్న లీ.. ఈ విషయాన్ని స్థానిక మీడియా ద్వారా తెలియజేశారు. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆ సెలూన్ మూసి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: వామ్మో..! తాళ్లు లేకుండా 123 ఫ్లోర్ల బిల్డింగ్‌పైకి సగం ఎక్కేశాడు..కానీ..     

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)