ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో కలకలం.. గన్‌లతో వ్యక్తి సంచారం

Published on Mon, 10/14/2024 - 07:38

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ర్యాలీకి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి  గన్‌లతో సంచరించటం కలకలం రేపింది. 

కాలిఫోర్నియాలోని కోచెల్లాలో నిర్వహించిన ట్రంప్‌ ర్యాలీ సందర్భంగా ఓ వ్యక్తి రెండు గన్‌లతో సంచరించాడని ట్రంప్ రక్షణ సహాయకుల బృందం షెరీఫ్ తెలిపింది. అక్రమ షాట్‌గన్ , లోడ్ చేసిన తుపాకీని స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రివర్‌సైడ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఆదివారం ప్రకటించింది.

 

ఈ విషయంపై తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. తాము వెంటనే అప్రమత్తమయ్యాయని, ట్రంప్‌నకు, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. గన్‌లను పట్టుకొని సంచరించిన నిందితుడిని లాస్‌వెగాస్‌కు చెందిన వెమ్ మిల్లర్‌గా పోలీసులు గుర్తించారు. ట్రంప్‌పై ఇది మూడో హత్యాయత్నంగా అధికారులు అనుమానిస్తున్నారు.

‘‘ఈ ఘటనలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది’ అని అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులను రక్షించే కల్పించే ఎఫ్‌బీఐ, యూఎస్‌ అటార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. లాస్ వెగాస్‌కు చెందిన 49 ఏళ్ల వెమ్ మిల్లర్‌ బెయిల్‌పై విడుదలయ్యాడని, జనవరి 2న కోర్టు విచారణను ఎదుర్కొంటాడని షెరీఫ్ బృందం తెలిపింది. 

జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ ట్రంప్‌ చెవికి తగులుతూ పక్కకు దూసుకువెళ్లింది. ఈ ఘటనలో ట్రంప్‌ తృటిలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా సెప్టెంబరులో ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర ఆయన్ను హత్య చేయడానికి 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌ వ్యక్తి రైఫిల్‌తో సంచరించినట్లు గుర్తించి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: యూఎస్‌ పౌరులను చంపిన వలసదారులకు మరణ శిక్ష: ట్రంప్‌

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)