Breaking News

సమయానికి దేవుడిలా రక్షించారు! లేదంటే ఆ చిన్నారి..

Published on Fri, 04/28/2023 - 15:23

ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు కిటికి నుంచి వేలాడుతున్నాడు. ఆ చిన్నారి తల కిటికిలో ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతున్నాడు. ఏ క్షణంలో పడిపోతాడో అని నరాలు తెగే ఉత్కంఠ సాగుతుండగా.. అనూహ్యంగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కజికిస్తాన్‌లో చోటుచేసుకుంది. 

అసలేం జరిగిందంటే.. ఓ మూడేళ్ల చిన్నారి అకస్మాత్తుగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా పడిపోయాడు. ఐతే అతడి తల ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలోని వారు సైతం ఆ చిన్నారిని గమనించకపోవడంతో.. ఆచిన్నారి అలా చాలా సేపు ఏ చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు  దీన్ని గమనించారు. ఐతే ఆ కుర్రాడిని రక్షించేందుకు ఏం చేయాలో తొలుత వారికి అర్థం కాలేదు.

ఎందుకంటే ఆ పిల్లాడి తల విండోలో ఇరుక్కుపోయింది. కాబట్టి అతన్ని కిందకి లాగితే ఆ చిన్నారికి ప్రమాదం. కాబట్టి కింద ఏ స్టూలో వేసి సాయం చేసి.. ఆ చిన్నారిలో ఉత్సాహం నింపాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు స్టూల్స్‌ని ఆ చిన్నారి కాళ్ల వద్ద ఉంచారు. కానీ ఆ చిన్నారి మాత్రం స్పృహ కోల్పోయాడు. ఎంతసేపు ఆ స్టూల్‌పై కాళ్లు నిలబడకుండా వేలాడిపోతుంటాయి. దీంతో వారు కూడా ఆ భవనంపై స్టూల్స్‌ పట్టుకుని  ఆ చిన్నారి స్పృహలోకి వచ్చేంత వరకు అలా నుంచొని ఉంటారు.

సరిగ్గా ఇంతలో ఆ చిన్నారి పేరెంట్స్‌ వచ్చి కంగారుపడుతూ, అరుస్తూ.. ఆ చిన్నారిని కిటికి గుండా పైకి లాగే యత్నం చేస్తారు. దీంతో ఆ చిన్నారి స్పృహలోకి వస్తాడు. హమ్మయ్యా! ఆ చిన్నారి బతికే ఉన్నాడనుకుని ఆ ఇద్దరు వ్యక్తులు ఊపిరి పీల్చుకుంటారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. ఆ పిల్లాడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఇద్దర్ని రియల్‌ హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.  

(చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్‌ కౌంటర్‌)

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)