Breaking News

‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’.. మసాజ్‌ మిషన్‌లో నుంచి కేకలు..

Published on Sat, 08/26/2023 - 11:43

పెద్దపెద్ద ఎలక్ట్రానిక్‌ స్టోర్స్‌లో మసాజ్‌ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్‌కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే ఈ విధంగా మసాజ్‌చైర్‌లో కూర్చున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. ఈ ఉదంతం జపాన్‌లో చోటుచేసుకుంది. ఒక వినియోగదారు మసాజ్‌ చైర్‌లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్‌ బంద్‌ అయిపోయింది. ఆ వ్యక్తి ఫోనులో ట్వీట్‌ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. @_Asphodelus అనే పేరు కలిగిన ట్విట్టర్‌ హ్యాండిల్‌ నుంచి ఈ వ్యక్తి ట్వీట్‌ చేశాడు. 

చీకటితో కూడిన ఒక ఫొటోను షేర్‌ చేసిన ఆయన ‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’ అని రాశాడు. కేఎస్‌ అనే పేరు కలిగిన స్టోర్‌ బంద్‌ అయి ఉండటాన్ని ఫోటోలో చూడవచ్చు. కాగా అనంతరం ఆ వ్యక్తి స్టోర్‌లోని అలారం మోగించగా పోలీసులకు ఈ సమాచారం అందింది. వెంటనే వారు స్టోర్‌ యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు.   మొత్తం 10 మంది పోలీసు అధికారులు స్టోర్‌లో నుంచి అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అతనిని దొంగ కాదని నిర్ధారించుకున్నారు. 

కాగా స్టోర్‌కు తాళాలు వేసిన సిబ్బంది మసాజ్‌ చైర్‌లో ఉండిపోయి ఇబ్బందిపడిన వ్యక్తిని క్షమాణలు కోరారు. అయితే ఈ స్టోర్‌లో ఆ వ్యక్తి ఎంతసేపు బందీ అయిపోయారన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టుకు 39 వేలకుపైగా షేర్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్‌ ‘డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో బంద్‌కావడం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. మరొక యూజర్‌ తాను అలా బందీ అయితే ‘ఎస్కేప్‌ ది రూమ్‌’ స్టయిల్‌ గేమ్స్‌ ఆడుకుంటానని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్‌ ఈ వీడియో!
 

Videos

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)