Breaking News

అమ్మ మృతదేహంతో ఆరు నెలలు

Published on Tue, 06/06/2023 - 08:40

ఒక వ్యక్తి గడచిన ఆరు నెలలుగా తల్లి మృతదేహంతో పాటు ఉంటున్నాడు. ఇరుగుపొరుగువారికి తన తల్లి విదేశాల్లో ఉంటున్నదని ఇన్నాళ్లూ అబద్ధం చెబుతూ వచ్చాడు. అయితే అతని వ్యవహారం ఎట్టకేలకు పోలీసుల చొరవతో బహిర్గతమయ్యింది. ఆ వ్యక్తి గత ఆరేళ్లుగా తల్లి మృతదేహాన్ని ఎందుకు అలానే ఉంచాడో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పెన్షన్‌ అందుకునేందుకే తాను తన తల్లి మృతదేహాన్ని ఉంచానని తెలిపాడు. అతను తన తల్లి రిటైర్మెంట్‌ ఫండ్‌ సొమ్మును ప్రతినెలా అందుకుంటున్నాడు.

నిందితుని వయసు 60 ఏళ్లు. అతని పేరు వెల్లడికాలేదు. డైలీ స్టార్‌ తెలిపిన వివరాల ప్రకారం నిందితుని తల్లి పేరు హెల్గా మారియా హ్యాంబర్త్‌. ఈ ఉదంతం ఇటలీలో చోటుచేసుకుంది. అతను తన ఇరుగుపొరుగువారితో  తన తల్లి హెల్గా తమ దేశమైన జర్మనీకి తిరిగి వెళ్లిపోయిందని చెబుతూ వస్తున్నాడు.  తల్లి మృతదేహంతో పాటు ఉంటూ నిందితుడు ఇప్పటివరకూ 156,000 పౌండ్లు (సుమారు రూ. 1.59 కోట్లు) అందుకున్నాడు. పోలీసులు ఇటీవలే ఇతని గుట్టును రట్టు చేశారు.  

మే 25న పోలీసులు ఎమర్జెన్సీ సర్వీస్‌ కోసం అతను ఉంటున్న బిల్డింగ్‌లోకి ప్రవేశించారు.  ఆ సమయంలో నిందితుడు తన తల్లి హెల్గా మృతదేహాన్ని ఒక బ్యాగులో దాచి, బెడ్‌పైన ఉంచాడు.  అతను ఇంటిలో లేడు. హెల్గా కరోనా వైరస్‌కు సంబంధించి తన హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కార్డు కోసం అప్పటివరకూ దరఖాస్తు చేయలేదు. ఈ నేపధ్యంలోనే పోలీసులు ఆమెను సంప్రదించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు అనుమానంతో ఇంటిలో తనిఖీలు చేశారు. అప్పుడు వారికి హెల్గా మృతదేహం లభ్యమయ్యింది. వెంటనే వారు హెల్గా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  మరణించిన తల్లి పెన్షన్‌ను నిందితుడు ఎలా తీసుకుంటున్నాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

చదవండి: బతికుండగానే కుమార్తెకు సంతాప సభ.. ఆమె చేసిన పని ఇదే..

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)