ఒక రోజు అద్దెతో ఐదేళ్లు తిష్ట.. న్యూయార్క్‌ హోటల్‌లో వింతవైనం!

Published on Sat, 02/17/2024 - 13:07

సాధారణంగా ఎవరైనా ఏదైనా హోటల్‌లో బస చేయానుకుంటే ఒక రోజో, రెండు రోజులో ఉంటారు.  అయితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా హోటల్‌లో  ఐదు సంవత్సరాలు గడిపాడు.. అది కూడా అద్దె లేకుండా.. నమ్మశక్యం కాని ఈ నిజం వెనుకనున్న కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.  

వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం మిక్కీ బారెటో(48) న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌లో ఉన్న ఒక హోటల్‌కు తానే యజమానినని చెప్పుకుంటూ ఐదేళ్లుగా అద్దె చెల్లించకుండా అందులోనే ఉంటున్నాడు. ఈ వ్యవహారంలో తప్పుడు ఆస్తుల రికార్డులు సృష్టించినందుకు తాజాగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 1930లో నిర్మితమైన ఈ వెయ్యి గదుల ఆర్ట్ డెకో న్యూయార్కర్ హోటల్‌లో ఐదేళ్ల క్రితం మిక్కీ బారెట్‌తో పాటు అతని ప్రియురాలు 200 డాలర్లకు (రూ. 16,500) ఒక గదిని బుక్ చేసుకున్నారు. మిక్కీ లాస్ ఏంజిల్స్ నుండి న్యూయార్క్‌కు వచ్చినప్పుడు తన ప్రియురాలిలో కలిసి ఈ గదిలో దిగాడు. 

తరువాత హోటల్ గదుల బుకింగ్ చట్టానికి సంబంధించిన అక్రమాల గురించి మిక్కీ తన ప్రియురాలికి చెప్పాడు. ఎవరైనా 1969 కి ముందు నిర్మించిన భవనంలో ఒకే గదిలో నివసిస్తున్నట్లయితే, వారు ఆరు నెలల లీజు కింద గదిని తీసుకోవచ్చు. హోటల్‌లో ఒక రాత్రి బస చేసేందుకు డబ్బులు చెల్లించిన తరువాత గదిని లీజుకు అడిగాడు. అయితే దీనికి హోటల్ యాజమాన్యం నిరాకరించింది. మిక్కీ ఈ విషయమై కోర్టును ఆశ్రయించాడు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి ఇందుకు అనుమతించకపోవడంతో, మిక్కీ సుప్రీంకోర్టుకు ఆశ్రయించాడు.

ఈ కేసులో విజయం సాధించిన మిక్కీకి బస చేసేందుకు హోటల్ గదిని ఇవ్వాలని, తాళం చెవిని కూడా అందించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2019 నుంచి 2023, జూలై వరకు అద్దె చెల్లించకుండా అదే హోటల్‌లో నివసిస్తున్నాడు. అయితే 2019లో ఒక నకిలీ అగ్రిమెంట్ లెటర్‌ను సృష్టించి, తానే హోటల్ యజమానినని ప్రకటించుకున్నాడు. తరువాత హోటల్ గదుల అద్దెను వసూలు చేయడం మొదలుపెట్టాడు. అనంతరం హోటల్  పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి, నగదు తనకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నించాడు. తాజాగా అతనిపై చీటింగ్‌ కేసు నమోదయ్యింది. అయితే తాను హోటల్ నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని మిక్కీ ఒక ప్రకటనలో తెలిపాడు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)