Breaking News

అది 48 ఏళ్ల క్రితంనాటి లెటర్‌.. ఎలా లభ్యమయ్యిందంటే..

Published on Sun, 07/09/2023 - 11:25

ఒక్కోసారి చరిత్ర తన దారిని వెదుకుతూ వర్తమానంలోకి వచ్చేస్తుందేమో! 48 ఏళ్ల క్రితం 14 ఏళ్ల బాలిక రాసిన ఒక ఉత్తరం ఇంటి తలుపు సందుల్లో దొరికింది. అమెరికాలోని ఇలినోయిస్‌కు చెందిన తాజెవెల్‌ కౌంటీలో ఒక పాత ఇంటిలోని ఒక తలుపు వెనుక ఒక బాటిల్‌లో దాచివుంచిన లెటర్‌ ఇప్పుడు లభ్యమయ్యింది. ఈ పాత ఇంటిలో వర్క్‌ చేసేందుకు వచ్చిన ఒక కార్పెంటర్‌ ఈ లెటర్‌ను గమనించాడు. తరువాత ఇది సోషల్‌ మీడియాలో షేర్‌ కావడంతో వైరల్‌గా మారింది. 

కార్పెంటర్‌కు ఎలా దొరికిందంటే..
ఫేస్‌బుక్‌ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం డకోటా మోహ్న్‌ అనే ఈ కార్పెంటర్‌ ఇంటి మెయింటనెన్స్‌ చూస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని దృష్టి లివింగ్‌ రూమ్‌లోని తలుపు ఫ్రేమ్‌వర్క్‌పై పడింది. దానిపై ‘నోట్‌ 9/29/1975' అని రాసివుంది. అక్కడున్న బాణం గుర్తును ఫాలో చేయగా కలపతో చేసిన కంపార్ట్‌మెంట్‌ను అతను తెరిచాడు. అక్కడ మూసివున్న ఒక బాటిల్‌లో చేతితో రాసిన ఒక ఉత్తరం లభ్యమయ్యింది. ఈ పోస్టు క్యాప్షన్‌లో డకోటా ఇలా రాశాడు. ‘నా వడ్రంగి కెరియర్‌లో నాకు ఎన్నో అమూల్యమైనవి లభించాయి. వాటిలో ఇది అత్యుత్తుమమైనది’

జర్నల్‌ స్టార్‌తో మాట్లాడిన డకోటా మోహ్న్‌‌..‘మా బృందం ఆ ఇంటిలోని లివింగ్‌ రూమ్‌లో పనిచేస్తోంది. నేను చెత్తను తుడిచే పనిలో ఉన్నాను. అప్పుడు అక్కడి తలుపుపై ఏదో రాసివుండటాన్ని గమనించాను. దానిపై ‘నోట్‌’ అని ఉంది. నేను నా సెల్‌ఫోన్‌ను అక్కడ ఫోకస్‌ చేసి, ఫొటో తీసుకున్నాను. తరువాత ఆ బాటిల్‌లోని లెటర్‌ తెరిచి నోట్‌  చదివాను’అని తెలిపారు. 

లెటర్‌ ఎవరు రాశారంటే..
సోషల్‌ మీడియాలో ఈ లెటర్‌ షేర్‌ అయిన అనంతరం ఒక మహిళ ఈ పోస్ట్‌ చదివారు. తాను తన 14 ఏళ్ల వయసులో ఈ లెటర్‌ రాశానని తెలిపారు. స్టెఫనీ హెరాన్‌ అనే ఈ మహిళ ఈ పోస్టుకు కామెంట్‌ రాస్తూ..‘ఈ లెటర్‌ నేనే రాశాను. నాకు నా చెల్లెలికి టైమ్‌ కాప్స్యూల్‌ అంటే చాలా ఇష్టం. ఇది అమెరికా ద్విశతాబ్దికి(1970 మధ్యకాలం) ముందునాటిది. ఆ మర్నాడే నా సోదరి జన్మించింది’ అని తెలిపారు. 
ఇది కూడా చదవండి: 11 ఏళ్లకే ఎవరైనా తండ్రి కాగలరా?.. సైన్స్‌ ఏమి చెబుతోందంటే..

#

Tags : 1

Videos

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

ప్రొద్దుటూరులో హై టెన్షన్... రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)