Breaking News

Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ

Published on Thu, 07/03/2025 - 07:55

న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి.  ఇదే నేపధ్యంలో మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా అపహరించింది. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ, మాలి ప్రభుత్వం ఆ ముగ్గురు భారతీయుల సురక్షితమైన విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

మాలిలోని కేస్‌లోగల డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో  ఆ ముగ్గురు భారతీయులు పనిచేస్తున్నారు. వీరి కిడ్నాప్‌ విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. జూలై  ఒకటిన సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ప్రాంగణంలో దాడి చేసి, ముగ్గురు భారతీయులను బందీలుగా తమ వెంట తీసుకువెళ్లిందని ఎంఈఏ తెలిపింది.

అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం)మాలి అంతటా జరిగిన దాడులకు బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ ముగ్గురు భారతీయుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం ఖండిస్తోందని, అపహరణకు గురైన భారత పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి  వెంటనే చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని  ఎంఈఏ కోరింది. మాలిలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని,అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని ఎంఈఏ సూచించింది.



ఇది కూడా చదవండి: విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే..

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)