Breaking News

భారత్‌ Vs మాల్దీవులు: ముయిజ్జు మరో సంచలన నిర్ణయం

Published on Fri, 03/08/2024 - 09:52

మాలె: డ్రాగన్‌ కంట్రీ చైనా అండతో మాల్దీవుల ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు మరోసారి భారత వ్యతిరేకతను వెళ్లగక్కారు. క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాల్దీవులకు భారత్‌ అందజేసిన హెలికాప్టర్‌, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ప్రకటించింది.

వివరాల ప్రకారం.. మాల్దీవుల ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకుంది. చైనా అండతో భారత వ్యతిరేక చర్యలకు పదునుపెడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ భూభాగం నుంచి భారత సైనికులను పంపించేయాలని నిర్ణయించగా తాజాగా మరో ముందడుగు వేసింది. భారత్‌ అందజేసిన హెలికాప్టర్‌, దాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిపై పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఇక, భారత దళాల ఉపసంహరణపై చర్చలు కొనసాగుతున్నాయని ఎంఎన్‌డీఎఫ్‌లోని ప్లాన్స్‌, పాలసీ, రీసోర్సెస్‌ విభాగం డైరెక్టర్‌ కర్నల్‌ అహ్మద్‌ ముజుథబ మహమ్మద్‌ తెలిపారు. మే 10 తర్వాత మాల్దీవుల భూభాగంపై విదేశీ దళాలు ఉండొద్దని అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు ఆదేశించినట్లు గుర్తుచేశారు. దీంతో, సైనిక సిబ్బంది నుంచి ఆ కేంద్రాల బాధ్యతలను చేపట్టేందుకు భారత్‌ నుంచి పౌర సిబ్బందితో కూడిన మరో బృందం అక్కడికి చేరుకుంది. కాగా, మాల్దీవుల్లో భారత్‌ మూడు వైమానిక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)