మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు!

Published on Sun, 01/07/2024 - 18:13

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసింది మాల్దీవులు ప్రభుత్వం. మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ సస్పెన్షన్‌కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది.

ఇప్పటికే మంతత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్‌ వేటు వేయటం గమనార్హం. 

ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ దేశపు తోలు బోమ్మ అని అనుచిత  కామెంట్‌ చేశారు. దీంతో ఒక్కసాగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు.

మాల్దీవులు మంత్రి చేసిన అవమానపూరిత వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటులు సైతం తీవ్రంగా ఖండిచారు. ‘భారత్‌పై మాల్దీవులు దేశ మంత్రులు​ అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. పొరుగు దేశంతో తాము స్నేహంగానే ఉండాలనుకుంటాం. కానీ, వారి ద్వేషాన్ని సహించము. మాల్దీవులులో ఎన్నోసార్లు పర్యటించాను. అయితే ఇటువంటి సమయంలో భారత్‌లోని దీవులను పర్యటిస్తూ.. మన పర్యాటకానికి మద్దతు ఇద్దాం’ అని బాలీవుడ్‌ నటుడు ఆక్షయ్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. 

‘చాలా పరిశుభ్రమై లక్ష్య ద్వీప్‌ బీచ్‌ను ప్రధాని మోదీ పర్యటించడం ఎంతో బాగుంది. విశేషమేంటంటే అవి కూడా మన దేశంలో ఉండటం’ అని నటుడు సల్మాన్‌ ఖాన్‌ తెలిపారు. ఇక.. వీరితోపాటు చాలామంది ప్రముఖులు, సామాన్యులు కూడా మాల్దీవులు మంత్రి వ్యాఖ్యలను సోషల్‌మీడియాలో తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ మాల్దీవులు పర్యటనను కూడా రద్దు చేసుకుంటున్నామని భారతీయ నెటిజన్లు సోషల్‌ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

చదవండి: మోదీపై అనుచిత పోస్టు.. ఖండించిన మాల్దీవుల ప్రభుత్వం

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)