Breaking News

Maldives Row: మిలిటరీ బలగాలను ఉపసంహరించుకోండి!

Published on Sun, 01/14/2024 - 19:38

మాల్దీవుల-భారత్‌ మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోంది. ఇటీవల ప్రధానమంత్రి లక్ష్యదీప్‌ పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు   కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మాల్దీవులలో ఉ‍న్న భారత భద్రతా బలగాలను తమ దేశం నుంచి మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని ఇండియాను కోరినట్లు ఓ ఉ‍న్నతాధికారి వెల్లడించారు.

ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న దౌత్య వివాదం నేపథ్యంలో మాల్దీవుల దేశం సుమారు రెండు నెలల తర్వాత మరోసారి భారత్‌ను తమ మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మాల్దీవులలో భారత్‌కు చెందిన 88 మంది మిలటరీ సైనికులు ఉన్నారు.

తమ ద్వీపదేశం నుంచి భారత భద్రతా దళాలను మార్చి 15 వరకు ఉపసంహిరించుకోవాలని మర్యాదపూర్వకంగా ఇండియాను కోరినట్లు మల్దీవుల పబ్లిక్‌ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా నజీమ్‌ ఇబ్రహీం తెలిపారు. ఇక నుంచి భారత భద్రతా బలగాలు మాల్దీవులలో ఉండరాదని తెలిపారు. తమ దేశ అధ్యక్షుడైన మహ్మద్‌ మొయిజ్జు పాలనాపరమైన విధానమని స్పష్టం చేశారు.

అయితే భారత్‌ భద్రతా బలగాలను ఉపసంహరించే విషయంపై  ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులతో ఉన్నతస్థాయి కమిటి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఉన్నత స్థాయి కమిటీ మొదటి సమావేశం జరగ్గా భారత హైకమిషనర్‌ మును మహవర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాల్దీవుల నుంచి భారత్‌ భద్రతా బలగాలను మార్చి 15 వరకు ఉపసంహరించుకోవాలని మాల్దీవుల పబ్లిక్‌ పాలసీ కార్యదర్శి అబ్దుల్లా ఇబ్రహీం కోరినట్లు  మును మహవర్‌ తెలిపారు.

ఇక.. చైనాకు అనుకూలమైన వ్యక్తిగా గుర్తింపు ఉ‍న్న మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నవంబర్‌లోనే భారత్‌ భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలని కోరిన విషయం తెలిసిందే.

చదవండి: Maldives: మహమ్మద్‌ ముయిజ్జుకు ఎదురుదెబ్బ.. భారత్‌కు ఫేవర్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)