Breaking News

భారత్‌కు కృతజ్ఞతలు తెలిపిన మాల్దీవుల అధ్యక్షుడు

Published on Mon, 07/29/2024 - 09:23

మాలె: తమ దేశ రుణ చెల్లింపులను సులభతరం చేయటంలో మద్దుతు ఇచ్చినందుకు మాల్లీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు భారత్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్‌,  మాల్దీవులు బలమైన సంబంధాలను ఏర్పరుస్తాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకొనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.  శుక్రవారం మాల్దీవలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు.

అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో దైత్య సంబంధమైన విషయాల్లో విదేశాంగ విధానం సాధించిన విజయాలను ప్రశంసించారు. దేశ రుణచెల్లింపులను సులభతరం చేయటంలో సాయం అంధించిన భారత్‌, చైనా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.  దేశంలో నెలకొన్న అమెరికా డాలర్ల కొరతను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే మాల్దీవుల ప్రభుత్వం భారత​, చైనా దేశాలతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని  వెల్లడించారు. 

బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.  అదేవిధంగా భారత్‌తో కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు  ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక.. గతంలో భారత్‌త్‌తో దౌత్యపరంగా దెబ్బతిన్న సంబంధాలను మళ్లీ పునరుద్ధరించుకోవాలని మహ్మద్ మొయిజ్జు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. గత నెలలో నరేంద్ర మోదీ మూడోసారి  ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ప్రెసిడెంట్‌ మహ్మద్‌ మొయిజ్జు హాజరైన విషయం తెలిసిందే.  

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు