Breaking News

మాల్దీవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు!

Published on Tue, 03/05/2024 - 14:55

మాలె: మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. మే 10 తర్వాత భారత్‌కు చెందిన ఓ ఒక్క మిలిటరీ సిబ్బంది తమ దేశంలో ఉండకూదని తెలిపారు. కనీసం సివిల్‌ డ్రెస్సుల్లో కూడా తమ భూభాగంలో తిరగడానికి వీలు లేదంటూ మంగళవారం పేర్కొన్నారు. సైనిక సహకారంపై చైనాతో మాల్దీవులు కీలక ఒప్పందం కుదుర్చుకున్న గంటల వ్యవధిలోనే ముయిజ్జు ఈ తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం

‘భారత సైన్యం ఉపసంహరణలో మా ప్రభుత్వం విజయం సాధించింది. కానీ దీనిని చూసి తట్టుకోలేని కొంతమంది (విపక్షాలు) తప్పుడు విషయాలను వ్యాప్తిచేస్తున్నారు. కొత్త ట్విస్ట్‌లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇండియన్ మిలిటరీ ఇక్కడి నుంచి వెళ్లడం లేదని.. వారు తమ యూనిఫామ్‌లను పౌర దుస్తులుగా మార్చుకొని మళ్లీ తిరిగి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దు. మే 10 తర్వాత భారత బలగాలు మాల్దీవుల్లో ఉండవు. యూనిఫామ్‌లో అయినా లేదా సివిల్‌ దుస్తుల్లోనూ ఎవరిని ఉండనివ్వం’ అని స్పష్టం చేశారు.
చదవండి: Melbourne: ‘డ్రాగన్‌’కు చెక్‌..! సింగపూర్‌ కీలక నిర్ణయం

మాల్దీవులలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తున్న భారత సైనిక సిబ్బందిని మార్చి 10లోగా మిగతా రెండు స్థావరలాల్లోని బలగాలను మే 10 నాటికి వెనక్కి వెళ్లిపోవాలని మాల్దీవులు విదేశాంగమంత్రిత్వ శాఖ తెలిపింది. దీనిపై ఢిల్లీలో ఫిబ్రవరి 2న ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ బలగాల స్థానంలో సమర్థులైన సాంకేతిక సిబ్బందిని నియమించేందుకు భారత్‌ పెట్టిన షరతును మాల్దీవులు అంగీకరించింది. దీంతో గతవారమే మాల్దీవుల్లో బాధ్యతలు స్వీకరించడానికి భారత సాంకేతిక బృందం అక్కడికి చేరుకుంది

కాగా మాల్దీవుల్లో మూడు వైమానిక స్థావరాల్లో 88 మంది భారత మిలిటరీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు రెండు హెలికాప్టర్లు ఒక డోర్నియర్ విమానాల ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా మాల్దీవుల ప్రజలకు మానవతా సాయం, వైద్యం కోసం తరలింపు వంటి సేవలను అందిస్తున్నారు. అయితే ముయిజ్జు గత సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌పై వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నారు. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)