Breaking News

ఆర్మీ వర్సెస్‌ యూనుస్‌

Published on Sun, 05/25/2025 - 02:16

ఢాకా: కొద్ది నెలలుగా అస్థిరతకు మారుపేరుగా మారిన బంగ్లాదేశ్‌లో మళ్లీ ముసలం పుట్టింది. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్, బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ)తో ముహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని ఆర్మీ చీఫ్, బీఎన్‌పీ చేస్తున్న ఒత్తిడిపై యూనుస్‌ వర్గం మండిపడుతోంది.

 బ్లాక్‌మెయిలింగ్‌ చర్యలను తక్షణం కట్టిపెట్టకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ శనివారం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. పరాజిత శక్తులు, విదేశీ కుట్రలు ప్రభుత్వ పనితీరుకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపణలకు దిగింది. సర్కారును కాపాడుకునేందుకు అవసరమైతే వీధి పోరాటాలకు కూడా యూనుస్‌ వర్గం సిద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. 

ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు యూనుస్‌ ఆదివారం పలు పారీ్టలతో భేటీ కానున్నారు. 2026 జూన్‌కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని యూనుస్‌ సర్కారు చెబుతుండగా వచ్చే డిసెంబర్‌లోగా జరిపి తీరాల్సిందేనని ఆర్మీ చీఫ్‌ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతున్నాయి. బీఎన్‌పీ ప్రేరేపిత ఆందోళనల నేపథ్యంలో ప్రధాని షేక్‌ హసీనా గత ఆగస్టులో దేశం వీడి భారత్‌లో ఆశ్రయం పొందడం తెలిసిందే. ఆర్మీ ఒత్తిళ్ల నేపథ్యంలో యూనుస్‌ తప్పుకుంటున్నట్టు తాజాగా వార్తలు రావడం, ఆయన వర్గం వాటిని ఖండించడం తెలిసిందే.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)