నేపాల్‌లో ‘డ్రాగన్‌’ ఆటలకు భారత్‌ ఎలా చెక్‌ పెట్టింది?

Published on Thu, 10/05/2023 - 08:08

చైనా రుణంతో నేపాల్‌లోని లుంబినీ, పోఖ్రాలలో నిర్మితమైన రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు  ఉపయోగంలో లేనివిగా మారాయి. ఈ రెండు విమానాశ్రయాల్లో టెర్మినల్ భవనం నుంచి రన్‌వే వరకు నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయింది. ప్రతిరోజూ ఒకటోరెండో దేశీయ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్నాయి. అయితే ఈ విమానాశ్రయాలు ఇప్పటికీ  అంతర్జాతీయ విమానాల రాక కోసం వేచి చూస్తున్నాయి. 

ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చూసి వ్యాపార దృష్టితో పెద్దఎత్తున అప్పులు చేసి, భూములు కొని, విలాసవంతమైన హోటళ్లను నిర్మించినవారు ఇప్పుడు ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటళ్లు నిత్యం ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది బౌద్ధ పర్యాటకులు లుంబినీని సందర్శిస్తారు. అయితే వారిలో ఎక్కువ మంది ఖాట్మండు నుండి దేశీయ విమానాల ద్వారా నగరానికి చేరుకుంటారు. పోఖ్రాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అటు లుంబినీ, ఇటు పోఖ్రాలో పర్యాటకులు ఎందుకు పెరగడం లేదు?

లుంబినీ, పోఖ్రాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినా పర్యాటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి భారత్‌, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణమని నేపాల్‌ అభిప్రాయపడింది. లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 2022లో నేపాల్ ప్రభుత్వం చైనా రుణంతో గౌతమబుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 76 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించింది.  గత ఏడాది మేలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది. లుంబినీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భైరహవా విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం కారణంగా పర్యాటకులు రాజధాని ఖాట్మండు నుండి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బదులు నేరుగా లుంబినీకి చేరుకోవచ్చు. అయినప్పటికీ పర్యాటకుల సంఖ్యలో ఊహించిన పెరుగుదల కనిపించడం లేదు. 

లుంబినీ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు క్రమం తప్పకుండా నడిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని విమానయాన, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ తన గగనతలం గుండా విమానాలు పశ్చిమ దిశగా వెళ్లేందుకు నిరాకరించిందని నేపాలీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే గౌతమ బుద్ధ విమానాశ్రయానికి చేరుకోవడానికి విమానాలేవీ భారతదేశం మీదుగా ప్రయాణించలేవు. చిన్న విమానాలకు మాత్రమే మినహాయింపు ఉంది. 

గత ఏడాది డిసెంబర్‌లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. గౌతమబుద్ధ విమానాశ్రయం ట్రాఫిక్ కోసం తెరిచిన ఏడు నెలలకే ఈ ఘటన జరిగింది. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్‌- చైనాల మధ్య ఎన్‌కౌంటర్ కూడా జరిగింది. ఇందులో 20 మంది భారతీయ ఆర్మీ సైనికులు అమరులయ్యారు. ఆ సమయంలో చైనా సైనికులు రెట్టింపు ప్రాణనష్టాన్ని చవిచూశారు.

కాగా ఖాట్మండు విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 2015లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దీనిని కొంతకాలం మూసివేశారు. పోఖ్రాలోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లుంబినీ తరహా సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. పోఖ్రాలో అన్నపూర్ణ పర్వతాల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వీటిని చూసేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా నియమితులైన నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం?

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)