Breaking News

Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి

Published on Thu, 01/23/2025 - 08:04

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. బుధవారం నాడు ఈ మంటలు మరింతగా చెలరేగి, భారీ నష్టాలను కలిగించాయి. మీడియాకు అందిన వివరాల ప్రకారం లాస్ ఏంజిల్స్ కౌంటీలో మరోసారి అటవీ మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. కాస్టిక్ సరస్సు సమీపంలోని కొండ ప్రాంతంలో ముందుగా మంటలు చెలరేగాయి. ఇప్పుడవి ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి.

మరోమారు చెలరేగిన ఈ మంటలు కేవలం రెండు గంటల్లోనే 5,000 ఎకరాల ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. శాంటా అనాలో వీచే గాలులు మంటలు చెలరేగడానికి కారణంగా నిలిచాయి. మంటల నుండి వచ్చే పొగ కారణంగా పెద్ద నల్లటి మేఘాలు ఏర్పడుతున్నాయి. కాగా ఇప్పటివరకు ఈ మంటల కారణంగా ఏ ఇల్లు లేదా వ్యాపారం దెబ్బతినలేదు. కానీ సరస్సు చుట్టుపక్కల ప్రాంతాల నుండి సుమారు 19 వేల మందిని  అక్కడి నుంచి తరలిస్తున్నారు.

ఈ నెల ప్రారంభంలో చెలరేగిన మంటల కారణంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. తాజాగా శాన్ డియాగో, ఓషన్‌సైడ్ సమీపంలో దక్షిణాన మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. వీటిని అగ్నిమాపక శాఖ అదుపు చేసిందన్నారు. లాస్ ఏంజిల్స్‌లో వీస్తున్న గాలుల కారణంగా మంటలు పదే పదే ఎగసిపడుతున్నాయి. లాస్ ఏంజిల్స్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం అక్కడ గంటకు 20 నుండి 30 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

దీని కారణంగా మంటలను ఆర్పడం అగ్నిమాప దళానికి, వైమానిక దళానికి ఇబ్బందిగా మారింది. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 27 మంది మృతిచెందారు. పలువురు గల్లంతయ్యారు వారి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 22 వేల ఇళ్లు బూడిదయ్యాయి.

ఇది కూడా చదవండి: వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా స్టార్లయిపోయి..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)