Breaking News

ఎందుకీ కార్చిచ్చు?!

Published on Mon, 01/13/2025 - 04:18

లాస్‌ ఏంజెలెస్‌కు కార్చిచ్చుకు కారణం ఏమిటన్నది చర్చనీయంగా మారింది. ఇలాంటి విపత్తులకు ప్రకృతి కంటే మానవ తప్పిదాలే ఎక్కువగా కారణమవుతుంటాయి. అడవుల్లో సాధారణంగా పిడుగుపాటు వల్ల  కార్చిచ్చులు రగులుతుంటాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగినప్పుడు చెలరేగే మంటలూ కార్చిచ్చుగా మారుతుంటాయి. ఇవిగాక మనుషుల నిర్లక్ష్యం కూడా ఈ ఉత్పాతానికి దారితీస్తుంటుంది. కాల్చిపడేసిన సిగరెట్‌ సైతం పెనువిపత్తుగా మారొచ్చు. 

తాజాగా లాస్‌ ఏంజెలెస్‌ను బుగ్గిపాలు చేస్తున్న కార్చిచ్చు సైంటిస్టులనే నిర్ఘాంతపరుస్తోంది. మంటలు ఇంత వేగంగా వ్యాప్తించడం మునుపెప్పుడూ చూడలేదని అగ్నిమాపక అధికారులు అంటున్నారు. వాతావరణ పరిస్థితులూ ఇందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. లాస్‌ ఏంజెలెస్‌లో చాలా రోజులుగా వానలే లేవు. దాంతో చెట్లు చేమలతోపాటు కొండల దిగువ ప్రాంతాల్లో గడ్డి పూర్తిగా ఎండిపోయింది. కనుకనే మంటలు సులభంగా అంటుకుని వ్యాపించాయి. 

బలమైన ఈదురు గాలులతో పరిస్థితి మరింత విషమించింది. ఏటా ఇదే సీజన్‌లో ‘శాంటా అనా’ గాలులు వీస్తుంటాయి. వీటి వేగం గంటకు 129 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్నికి ఆజ్యంలా కార్చిచ్చుకు ఈ గాలులు జతకలిశాయి. వాటి ధాటికి విమానాలు, హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో ఆకాశం నుంచి నీరు, అగ్నిమాపక రసాయనాలు చల్లే వీల్లేకుండాపోయింది. దాంతో మంటలను అదుపులోకి తేవడం మరింత కష్టసాధ్యంగా మారింది. 

మానవ తప్పిదాలతో భారీ మూల్యం  
లాస్‌ ఏంజెలెస్‌ కార్చిచ్చు వంటివాటి రూపంలో వాతావరణ మార్పుల దు్రష్పభావాన్ని స్పష్టంగా చూస్తున్నామని నిపుణులు చెబుతున్నారు. ‘‘మానవ తప్పిదాల వల్ల మున్ముందు ఇలాంటి విపత్తుల ముప్పు మరింత పెరుగుతుంది. అవి వ్యాప్తి చెందే వేగమూ పెరుగుతుంది’’ అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టకపోతే ప్రకృతి విపత్తులు మరింతగా విరుచుకుపడడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

 ‘‘కార్చిచ్చు అమెరికాకు పరిమితమైంది. కాదు. నేడు ప్రపంచమంతా ఈ ముప్పు ముంగిట ఉంది’’ అని తేల్చిచెబుతున్నారు. చిన్న మంటగా మొదలయ్యే కార్చిచ్చులు క్షణాల్లోనే విస్తరించి నియంత్రించలేని స్థాయికి చేరుకుంటాయి. మానవ కార్యకలాపాల పుణ్యమా అని విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. 

→ లాస్‌ ఏంజెలెస్‌లో 2022, 2023లో వరుసగా రెండేళ్లు భారీగా వర్షాలు కురిశాయి. ఏకంగా 133 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చెట్లు బాగా పెరిగాయి. పచ్చదనం పరుచుకుంది.  2024లో పరిస్థితి ఒక్క సారిగా తారుమారైంది. వర్షాల్లేక కరువు తాండవించింది. చెట్లు ఎండిపోయాయి. దక్షిణ కాలిఫోర్నియా మొత్తం కరువు ఛాయలే! కార్చిచ్చు ఊహాతీత వేగంతో వ్యాపించడానికి ఇదే ప్రధాన కారణమని సైంటిస్టు మాట్‌ జోన్స్‌ విశ్లేషించారు. 

→ కాలిఫోరి్నయా వంటి నగరాల్లో జనాభా అధికం. ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ఇ లాంటి నగరాల్లో నివసించడం క్షేమమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

→ ఇటీవలి కాలంలో బీమా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. లాస్‌ ఏంజెలెస్, పరిసర నివాసాలకు బీమా రక్షణ కలి్పంచేందుకు కొంతకాలంగా నిరాకరిస్తూ వస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే భారీ మొత్తంలో బీమా సొమ్ము చెల్లించాల్సి ఉండటమే ఇందుకు కారణం. 

→ లాస్‌ఏంజెలెస్‌లో ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించబోతున్నారు. అందుకు ప్రభుత్వం సాయం అందించబోతోంది. కార్చిచ్చులను దృష్టిలో పెట్టుకొని వాటి నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)