Breaking News

లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు.. 33 మంది మృతి

Published on Wed, 11/13/2024 - 10:17

బీరుట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. హెజ్‌బొల్లా గ్రూప్‌ టార్గెట్‌గా చేసిన ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన దాడుల్లో దేశవ్యాప్తంగా 33 మంది మృతి చెందినట్లు లెబనాన్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుగల గ్రూప్‌ హెజ్‌బొల్లాకు బలమైన ప్రాంతాలు ఉన్న బీరుట్‌లోని దక్షిణ శివారును లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దాడులు చేసింది.

బీరుట్‌కు దక్షిణంగా ఉన్న చౌఫ్ ప్రాంతంలోని ఓ పట్టణంలో జరిగిన దాడుల్లో కనీసం 15 మంది మరణించారని లెబనాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చౌఫ్ జిల్లాలో జోన్‌పై ఇజ్రాయెల్ దాడిలో.. ఎనిమిది మంది మహిళలు, నలుగురు పిల్లలు సహా 15 మంది మరణించారని పేర్కొంది. ఈ దాడిలో మరో 12 మంది గాయపడ్డారని  తెలిపింది.

అదే విధంగా బీరుట్‌కు తూర్పున ఉన్న పర్వతం అలే ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందిన ఇంటిపై ఇజ్రాయెల్‌ దాడి చేసిందని అధికారులు తెలిపారు. దక్షిణ లెబనాన్‌లోని టైర్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఒకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)