Breaking News

పూచీకత్తుగా రూ.96 కోట్లు

Published on Sat, 10/18/2025 - 05:28

బీరుట్‌: లిబియా దివంగత నేత కల్నల్‌ గఢాఫీ కుమారుడు హానిబాల్‌ గఢాఫీని బెయిల్‌పై విడుదల చేసేందుకు అక్కడి కోర్టు అంగీకరించింది. అయితే, బెయిల్‌ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు విడుదల కావచ్చని పేర్కొంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన గఢాఫీ తిరుగుబాటుదార్ల చేతిలో 2011 అక్టోబర్‌లో చనిపోయారు. 

అయితే, ఆయన పాలనాకాలంలో 1978లో లిబియాకు వచ్చిన షియాల గురువు మౌసా అల్‌ సదర్‌ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అయితే, గఢాఫీ కుమారుడు హానిబాల్‌కు ఆ విషయం తెలుసని అనుమానించిన మిలిటెంట్ల గ్రూపు 2015లో ఆయన్ను అపహరించి బాల్బెక్‌లో ఉంచింది. అనంతరం లెబనాన్‌ పోలీసులు అతడిని మిలిటెంట్ల చెరనుంచి విడిపించి బీరుట్‌ జైలులో ఉంచారు. అప్పటి నుంచి దాదాపు దశాబ్దకాలంగా ఎలాంటి విచారణ లేకుండా జైలులోనే మగ్గుతున్నారు.

 శుక్రవారం అధికారులు ఆయన్ను జస్టిస్‌ ప్యాలెస్‌లో జడ్జి జహెర్‌ హమాదెహ్‌ ఎదుట హాజరుపరిచారు. హానిబాల్‌ బెయిల్‌ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా ఆయన నిర్ణయించారు. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే జైలు నుంచి విడుదల కావచ్చని తెలిపారు. అయితే, రెండు నెలలపాటు దేశం విడిచి వెళ్లరాదనే షరతును విధించారు. 

హానిబాల్‌ తరఫు లాయర్‌ చర్బెల్‌ మిలాడ్‌ అల్‌–ఖౌరీ ఈ విషయం మీడియాకు వెల్లడించారు. హానిబాల్‌ వద్ద ప్రస్తుతం డబ్బు లేదని చెప్పారు. ఆయన బ్యాంకు అక్కౌంట్లపై నిషేధం ఉందని చెప్పారు. కాగా, షియా గురువు మౌసా అల్‌ సదర్‌ అదృశ్యం వ్యవహారం లెబనాన్‌లో ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. లెబనాన్‌లోని ఏదో ఒక జైలులో ఆయన సజీవంగా ఉండి ఉంటారని కుటుంబీకులు భావిస్తుండగా, ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. జీవించి ఉంటే ఆయనకు ఇప్పుడు 96 ఏళ్లుంటాయని అంచనా.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)