Breaking News

Kargil War: ఎట్టకేలకు అంగీకరించిన పాక్‌

Published on Sat, 09/07/2024 - 19:05

కార్గిల్‌ యుద్ధంలో తాము పాల్గొన్నట్లు ఎట్టకేలకు దాయాది దేశం పాక్‌ అంగీకరించింది.  ఈ మేరకు ఆ దేశ సైన్యాధిపతి బహిరంగ ప్రకటన చేశారు. దీంతో.. పాతికేళ్ల తర్వాత పాక్‌ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్లయ్యింది.

శుక్రవారం రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో పాక్‌ డిఫెన్స్‌ డే కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిమ్‌ మునీర్‌ ప్రసంగిస్తూ.. ‘‘భారత్, పాకిస్థాన్‌ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్‌ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది’’ అని అన్నారు.  ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

1999 మే-జులై మధ్య కార్గిల్‌ యుద్ధం జరిగింది. ముజాహిదీన్‌ల ముసుగులో నియంత్రణ రేఖను దాటి భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన శత్రుసేనలు.. కార్గిల్‌లో ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. కౌంటర్‌గా ఇండియన్‌ ఆర్మీ ‘ఆపరేషన్‌ విజయ్‌’ పెట్టింది. ఈ ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్‌.. తోకముడుచుకుని పారిపోయింది.  జులై 26న పాక్‌ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించగా.. అప్పటి నుంచి ఆ తేదీన  కార్గిల్‌ విజయ్‌ దివస్‌ నిర్వహించుకుంటున్నాం.

అయితే.. ఈ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్‌ చెబుతూ స్న్నేతోంది. ముజాహిదీన్‌ ఫైటర్లు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పాట్రోలింగ్‌ మాత్రమే చేశామని చెప్పింది. గతంలో పాక్‌ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్‌లో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని చెప్పారు. ఆ ఆపరేషన్‌ను ‘ఫోర్‌ మ్యాన్‌ షో’ అని లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) షాహిద్‌ అజీజ్‌ అభివర్ణించారు.  అయితే పాక్‌ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. తాజా ప్రకటనతో.. పాక్‌ ఓటమి గుట్టు బట్టబయలైంది.

సంబంధిత వార్త: గెలవలేని యుద్ధం చేసిన పాక్‌

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు