Breaking News

వలసదారుల పాలిట సింహస్వప్నం లేకెన్ రిలే చట్టం

Published on Thu, 01/23/2025 - 15:55

మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి.. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి.. అంటూ 1976లో సి. నారాయణరెడ్డి రాసిన పాటను ఎవరైనా ట్రంప్ కు వినిపిస్తే బాగుణ్ణు.  పోనీ పాట పాడడం రాకపోతే అప్పట్లో సోక్రటీస్ చెప్పిన మాటను అయినా అమెరికా అధ్యక్షుడికి ఆయనకు వినిపించండి. సోక్రటీస్ ఏమన్నారా... ఆనాటి సమాజంలో పెద్ద నేరంగా పరిగణించబడిన తప్పిదానికి పాల్పడిన ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపాలని ఆనాటి గ్రీకు రాజు తీర్పు ఇచ్చారు.

ఆమె ప్రాణభయంతో పరుగుపరుగున సోక్రటీస్ వద్దకు వచ్చిందట.. ఆమెను వదిలిపెట్టి తమకు అప్పగిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తామని గ్రామస్తులు సోక్రటీసును కోరారట. అయితే అప్పుడు సోక్రటీస్.. అలాగే .. మీరన్నట్లుగానే ఆమెను మీకు అప్పగిస్తాను.. అయితే 'మీలో ఏనాడూ.. చిన్న పొరపాటు.. తప్పిదం.. ఏ పాపం చేయని వాళ్ళు మొదటి రాయి విసరండి. దీనికి మీ అంతరాత్మే రుజువు' అని కండిషన్ పెట్టారట. దీంతో వచ్చినవాళ్లలో ఎవరూ ఒక్క రాయి కూడా విసరాలేకపోయారట.. వచ్చినవాళ్లంతా ఏదోనాడు చిన్నదో పెద్దదో తప్పు చేశారట.. అందుకే అందరూ రాళ్లు అక్కడ పడేసి వెళ్లిపోయారట ఈ ఎపిసోడ్ కూడా ట్రంప్ కు చెప్పాలి .. ఎందుకంటే

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పూటపూటకూ కొత్త చట్టాలు.. నిబంధనలు తీసుకొస్తూ.. అమెరికాలో నివసిస్తున్న వలసజీవులకు నిద్రలేకుండా చేస్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్నంతమాత్రాన అమెరికా పౌరులు అయిపోలేరు అంటూ టీజర్ రిలీజ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఇంకో టీజర్ సిద్ధం చేసారు. వలసదారులపాలిట సింహస్వప్నంలాంటి లేకెన్ రిలే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని.. ఇక అమెరికాలో చిన్నపాటి నేరాలను సైతం తీవ్రంగా పరిగణించి అమెరికా నుంచి స్వదేశానికి పంపేస్తారన్నమాట.

చిన్న నేరానికి కూడా వెలివేస్తారా?
అమెరికాలో 2022లో లేకెన్ రిలే అనే అమెరికా అమ్మాయిని వెనిజులా నుంచి వచ్చిన ఒక వలసదారుడు హత్య చేసాడు.  వాస్తవానికి ఆ హత్య చేసిన అంటొనియా ఇబర్రా అనేవ్యక్తి మీద గతంలో కూడా కేసు నమోదైంది. కానీ అరెస్ట్ చేయలేదు. అప్పుడే వాణ్ని జైల్లో పడేసి ఉంటె ఈ లేకెన్ రిలే హత్యకు గురయ్యేది కాదు కదా.. వలసదారులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం వాళ్ళ స్థానిక అమెరికన్లకు భద్రతా లేకుండా పోతోంది. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని లొసుగులు.. కొన్నికొన్ని మినహాయింపులు ఇలా వలసదారులకు వరంగా మారుతున్నాయి అనే వాదన మొదలైంది.

ఇదీ చదవండి: చట్టసభల్లో ట్రంప్‌ తొలి విజయం.. లేకెన్‌ రిలే చట్టం గురించి తెలుసా?

దీంతో ఆమె పేరిట ఒక చట్టాన్ని తీసుకురాగా దానికి ట్రంప్ మద్దతుపలుకుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం కింద ఎవరైనా విదేశీయుడు అమెరికాలో బుద్దిగా ఉండకుండా విచ్చలవిడిగా ఉంటె వెంటనే అరెస్ట్ చేస్తారు.. అంతేకాకుండా వాళ్ళను వెనువెంటనే వారి స్వదేశానికి తరిమేస్తారన్నమాట. ఇది అమెరికా వెళ్లి చదువుకుంటున్న.. ఉద్యోగం చేస్తున్న లక్షలాదిమంది భారతీయులతోబాటు పలు విదేశీయులకూ ప్రమాదంగా మారుతోంది.

చిన్న చిన్న తప్పులు చేసి అరెస్ట్ అయినంతమాత్రాన అమెరికాలో చదువుకుంటున్న.. జాబ్ చేస్తున్నవాళ్లను వెనువెంటనే వారి స్వదేశానికి పంపేయడం ఏమిటన్న వాదన మొదలైంది.  యువత.. విద్యార్థులు తెలిసో.. తెలియకో.. ఏదో చిన్న చిన్న నేరాలు చేసినంతమాత్రాన  మొత్తం దేశబహిష్కరణ చేసేసి వారి ఆశలను చిదిమేస్తారా.. అవసరం ఐతే కేసు పెట్టి.. విచారించి శిక్ష వేయాలి కానీ ఇలా ఏకంగా వారి భవిష్యత్తును నాశనం చేస్తారా అనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.
-సిమ్మాదిరప్పన్న

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)