Breaking News

వాంగ్‌చుక్‌కు పాక్‌తో సంబంధాలు.. పక్కా ఆధారాలున్నాయి: డీజీపీ

Published on Sat, 09/27/2025 - 18:18

లేహ్‌: లద్దాఖ్‌ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను పోలీసులు నిన్న(సెప్టెంబర్‌ 26 శుక్రవారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లద్దాఖ్‌ రాజధాని లేహ్‌లో జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడ్డారు. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ) కింద డీజీపీ ఎస్‌.డి.సింగ్‌ జమ్వాల్‌ ఆధ్వర్యంలో సోనమ్‌ వాంగ్‌చుక్‌ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. సోనమ్‌ వాంగ్‌చుక్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయంటూ లద్దాఖ్‌ డీజీపీ ఎస్‌డీ సింగ్‌ జామ్వాల్‌ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. పాక్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్న డీజీపీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్‌ డీజీపీ వెల్లడించారు. ఓ పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ అధికారితో వాంగ్‌చుక్‌కు సంబంధాలున్నాయని పేర్కొన్న డీజీపీ.. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. పాక్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వాంగ్‌చుక్‌ హాజరైనట్లు తేలిందన్నారు.

కాగా, లద్దాఖ్‌లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్‌చుక్‌ కారణమంటూ కేంద్ర హోంశాఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరబ్‌ వసంతం, నేపాల్‌ జెన్‌–జెడ్‌ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్‌చుక్‌ ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు.

 

 

 


 

 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)