Breaking News

Kuwait Fire Incident: 49లో 45 మంది భారతీయులే

Published on Fri, 06/14/2024 - 04:49

కువైట్‌ సిటీ/ దుబాయ్‌: గల్ఫ్‌ దేశం కువైట్‌లో బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో అగ్నికి ఆహుతైన 49 మందిలో 45 మంది భారతీయులేనని అధికారులు తెలిపారు. మరో ముగ్గురు ఫిలిప్పీన్స్‌ దేశస్తులు కాగా మరో మృతదేహాన్ని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల్లో మలయాళీలు 24 మంది ఉన్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. 

ఆ రాష్ట్ర వాసులు మరో ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో ఐసీయూల్లో చికిత్స పొందుతున్నట్లు గుర్తించామని వెల్లడించింది. విదేశాంగ శాఖ నుంచి ధ్రువీకరణ సమాచారం అందాక బాధితుల వివరాలను వెల్లడిస్తామని తెలిపింది. కువైట్‌ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్‌ ప్రాంతంలోని ఏడంతస్తుల భవనంలో బుధవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో 49 మంది మృతి చెందగా మరో 50 మంది వరకు గాయపడ్డారు. 

గురువారం కువైట్‌ చేరుకున్న విదేశాంగ మంత్రి కీర్తివర్థన్‌ సింగ్‌ క్షతగాత్రులైన భారతీయులతో మాట్లాడి, వారికి అవసరమైన సాయం అందేలా చూస్తున్నారు. ముబారక్‌ అల్‌కబీర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న భారతీయులను పరామర్శించారు. అదేవిధంగా, మృతదేహాలను సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

నీళ్ల ట్యాంకుపైకి దూకి..
ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఆ భవనంలో కేరళలోని త్రిక్కారిపూర్‌కు చెందిన నళినాక్షన్‌ కూడా నిద్రిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్న ఆయన జనం హాహాకారాలు విని, వెంటనే అప్రమత్తం అయ్యారు. భవనం సమీపంలోనే ఉన్న వాటర్‌ ట్యాంకుపైకి దూకారు. పక్కటెముకలు విరిగి, తీవ్రంగా గాయపడిన నళినాక్షన్‌ ట్యాంకుపైన చిక్కుకుపోయారు. కదల్లేని స్థితిలో ఆయన్ను ఉదయం 11 గంటల సమయంలో కొందరు గుర్తించి కిందికి దించి, ఆస్పత్రికి తరలించారని అతడి మామ బాలకృష్ణన్‌ చెప్పారు.

కుమార్తెకు బహుమతిగా ఫోన్‌ ఇవ్వాలని..
12వ తరగతి బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన తన కూతురికి ఫోన్‌ బహుమతిగా ఇవ్వాలనుకున్నారు లుకాస్‌. ఇంటికెళ్లాక కుమార్తెను స్వయంగా బెంగళూరు తీసుకెళ్లి నర్సింగ్‌ స్కూల్‌లో చేర్పిద్దామనుకున్నారు. అయితే, ఆ కల నెరవేరలేదు. కువైట్‌ ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారిలో కేరళలోని కొల్లంకు చెందిన లుకాస్‌ కూడా ఉన్నారు. బుధవారం వేకువజామున ప్రమాదం జరిగిన సమయంలో లూకాస్‌ తమ సొంతూళ్లోని చర్చి ఫాదర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా ఫోన్‌ డిస్‌ కనెక్టయ్యింది. తర్వాత చర్చి ఫాదర్‌ ఫోన్‌ చేసినా లూకాస్‌ లిఫ్ట్‌ చేయ్యలేదు. 18 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్న లూకాస్‌కు వృద్ధులైన తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)