CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
ఎప్స్టీన్ ఫైల్స్ : పోలీసు కస్టడీ నుంచి బ్రిటన్ మాజీ ప్రిన్స్ విడుదల
Published on Fri, 02/20/2026 - 03:20
అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాల కేసులో అరెస్ట్ అయిన బ్రిటన్ మాజీ యువరాజు ఆండ్రూ మౌంట్‌బాటన్ .. పోలీసుల కస్టడీ నుంచి విడుదలయ్యారు. సుమారు 11 గంటల విచారణ అనంతరం ఆయనను విడిచిపెట్టారు. కాగా ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారనే ఆరోపణలపై థేమ్స్ వ్యాలీ పోలీసులు ఆండ్రూను గురువారం ఉదయం అరెస్ట్ చేశారు.
తన 66వ పుట్టిన రోజునే ఆండ్రూను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఆ తర్వాత ఆయనను దాదాపు రోజుంతా ఐల్షామ్ పోలీసు స్టేషన్లో ఉంచి విచారించారు. అయితే 'రిలీజ్డ్ అండర్ ఇన్వెస్టిగేషన్' కింద పంపించేశారు. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే, బ్రిటన్ చట్టాల ప్రకారం గరిష్టంగా జీవితఖైదు పడే అవకాశం ఉంది.
అసలేమి జరిగిందంటే?
ఆండ్రూ మౌంట్‌బాటన్.. 2001 నుండి 2011 వరకు బ్రిటన్ వాణిజ్య రాయబారిగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన కీలక సమాచారాన్ని ఎప్స్టీన్కు చేరవేసినట్టు నివేదికలు వెల్లడించాయి. వియత్నాం, సింగపూర్, హాంగ్‌కాంగ్ వంటి దేశాల పర్యటనలకు సంబంధించిన అత్యంత రహస్య వాణిజ్య రిపోర్టులు తన మిత్రుడు ఎప్స్టీన్కు ఈమెయిల్ చేశారని తాజాగా వెల్లడైన ఎప్స్టీన్ ఫైల్స్ బహిర్గతం చేశాయి. తన సోదరుడి అరెస్ట్‌పై కింగ్ చార్లెస్ స్పందించారు. "చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని స్పష్టం చేశారు. రాజకుటుంబం పోలీసుల విచారణకు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
Tags : 1