Breaking News

రష్యా గడ్డపై కిమ్‌.. నాలుగేళ్ల తర్వాత తొలిసారి

Published on Wed, 09/13/2023 - 09:38

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మంగళవారం రష్యాలో అడుగు పెట్టారు. ర‌ష్యాకు కిమ్ వెళ్ల‌డం ఇది రెండో సారి. తొలుత 2019లో ఆయ‌న మొద‌టిసారి రష్యాలో పర్యటించారు. దాదాపు నాలుగేళ్ల తరువాత మరోసారి రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం కొందరు మంత్రులతో భేటీ అయ్యారు.

బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా తెలియరాలేదు. 2019లో ఇరువురు నేతలు వ్లాదివోస్తోక్‌లోనే సమావేశమయ్యారు. ఈసారి కూడా భేటీ అక్కడే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కిమ్‌ మాట్లాడుతూ.. దేశాల సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యత కోసం రష్యాతో భేటీ అవుతున్నట్లు తెలిపారు.

ఇక పటిష్టమైన భద్రత మధ్య విలాసవంతమైన బుల్లెట్‌ ప్రూఫ్‌ రైలులో సుదీర్ఘంగా ప్రయాణించి రష్యాకు చేరుకున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం ఉత్తర కొరియా రాజధాని పాంగ్‌యాంగ్‌ నుంచి రైలులో బయలుదేరారు. 740 కి.మీ ప్రయాణించి ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలో రష్యా భూభాగంలో ఉన్న వ్లాదివోస్తోక్‌ నగరానికి ఉత్తర దిక్కున 60 కిలోమీటర్ల దూరంలోని ఉసురియ్‌స్క్‌ అనే ప్రాంతానికి ఈ రైలు చేరుకున్నట్లు దక్షిణ కొరియా వార్తా సంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది.

ఈ ప్రాంతంలో కొరియన్ల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంది. అయితే, కిమ్‌ గమ్యస్థానం ఏమిటన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కిమ్‌ రష్యాకు చేరినట్లు క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ నిర్ధారించారు. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల ఒంటరిగా మారిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యా సహాయాన్ని అర్థిస్తున్నారు.   


చదవండి: అమెరికాకు వ్యతిరేకంగా చేతులు కలిపిన రష్యా, ఉత్తర కొరియా

గంటకు 50 కిలోమీటర్ల వేగమే..
ఉత్తరకొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రయాణించిన రైలుకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కేవలం గంటకు 50 కిలో మీటర్ల వేగంతోనే ప్రయాణిస్తుంది. దీనికి భారీగా సాయుధ కవచాలు అమర్చి ఉండటంతో భారీ బరువు కారణంగా వేగంగా వెళ్లలేదు. ఈ రైలుపేరు తయాంఘో.. అంటే కొరియా భాషలో సూర్యుడు అని అర్థం. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌కు గుర్తుగా ఈ పేరుపెట్టారు. ఆయన కాలం నుంచే ఉ.కొరియా నేతలు సుదూర ప్రయాణాలను రైల్లోనే చేయడం మొదలుపెట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌