Breaking News

‘కనిష్క’ నిందితుడి హంతకుడికి జీవిత ఖైదు

Published on Wed, 01/29/2025 - 12:14

ఒట్టావా:‘కనిష్క’ పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని హత్య చేసిన నేరంలో సుపారీ కిల్లర్‌ టా‌న్నెర్‌ ఫాక్స్‌కు కెనడా కోర్టు జీవిత ఖైదు విధించింది. 20 ఏళ్లపాటు జైలు శిక్ష వేసింది. 2022 జులైలో కనిష్క పేలుడు నిందుతుడు రిపుదమన్‌సింగ​ మాలిక్‌ను ఫాక్స్‌ కాల్చి చంపాడు. మాలిక్‌ను చంపిన కేసులో ఫాక్స్‌తో పాటు అతని అనుచరుడు లోపేజ్‌ గత ఏడాది అక్టోబర్‌లో నేరం ఒప్పుకున్నారు. 

మాలిక్‌ను చంపేందుకు తాము సుపారీ తీసుకున్నామని ఫాక్స్‌ కోర్టు ముందు ఒప్పుకున్నాడు. అయితే తమకు డబ్బులిచ్చింది ఎవరనేది ఫాక్స్‌ వెల్లడించకపోవడం గమనార్హం. కాగా,1985 జూన్‌ 23న టొరంటో నుంచి ముంబై వెళుతున్న ఎయిర్‌ఇండియా కనిష్క విమానాన్ని ఉగ్రవాదులు గాల్లోనే పేల్చివేశారు. ఈ ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోయారు. 

మృతి చెందిన వారిలో ఎక్కువ మంది ఇండియాకు వచ్చి వెళుతున్న కెనడా వాసులే. అమెరికాలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడులు జరిగేదాకా కనిష్క బాంబు పేలుడు ఘటననే అత్యంత దారుణ ఉగ్రవాద చర్యగా భావించే వాళ్లు. కాగా, కనిష్క పేలుడు కేసులో విచారణ ఎదుర్కొన్న మాలిక్‌ నిర్దోషిగా విడుదలయి చివరికి సుపారీ కిల్లర్‌ ఫాక్స్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)