Breaking News

కమల ‘యాస’పై ట్రంప్‌ బృందం ట్రోల్స్‌

Published on Tue, 09/03/2024 - 16:34

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. నువ్వా-నేనా అన్నట్లు మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌  ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. కమలా హారిస్‌పై ఇప్పటికే ట్రంప్‌, ఆయన ప్రచార బృందం పలు ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

అయితే తాజాగా కమల మాట్లాడిన ‘యాస​’పై కూడా ట్రంప్‌ ప్రచార బృందం పెద్దఎత్తున ట్రోల్‌ చేస్తోంది. ఆమె నకిలీ యాసతో ప్రసంగం చేసినట్లు ఆరోపణలు గుప్పిస్తోంది. కమల ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లోని డెట్రాయిట్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన లేబర్‌ డే ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అయితే ఆమె అక్కడి టీచర్లు, యూనియన్‌ సభ్యులను ఉద్దేశిస్తూ.. ‘వారంలో ఐదు రోజుల పని. సిక్‌ లీవు, వేతనంతో కూడిన సెలవు, వెకేషన్‌ కోసం సెలవు ఇస్తున్న యూనియన్ మెంబర్స్‌కు మీరంతా కృతజ్ఞతలు తెలిపాలి’ అని అన్నారు.

 

అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే నకిలీ యాసతో మాట్లాడారని ట్రంప్‌ ప్రచారం బృందం సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్‌  చేస్తోంది. కొంతమంది లూనీ ట్యూన్స్ పాత్ర అయిన ఫోఘోర్న్ లెఘోర్న్‌తో ఆమె యాసను పోల్చుతున్నారు. ఇక.. కమలా హారిస్‌ యాసపై విమర్శలు రావటం ఇదే మొదటిసారి కాదు. 2021లో అట్లాంటాలో ఓ ర్యాలీలో పాల్గొని మాట్లానప్పుడు యాసపై ఆమె విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఏకంగా ఆమె ఫ్రెంచ్‌ యాసలో మాట్లాడారని ఆరోపణలు చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను పేరును అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించినప్పటి నుంచి ఆమెపై ట్రంప్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. జాత్యహంకార విమర్శలు మొదలుకొని ఆమె నవ్వుపై కూడా  విమర్శలు చేశారు. ఇక.. ఇండో అమెరికన్‌ అయిన కమల కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో జన్మించారు. కమల తల్లి భారతీయురాలు కాగా, ఆమె తండ్రి జమైకన్ అన్న విషయం తెలిసిందే.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు