ట్రంప్‌ వారిని అవమానించారు : కమలా హారిస్‌

Published on Sun, 09/01/2024 - 10:18

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటిక సందర్శన చర్చనీయాంశంగా మారింది. సైనికుల స్మశానవాటిక సందర్శన వీడియోలు, ఫొటోలను ట్రంప్‌ బృందం అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి వినియోగించుకోవటంపై ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ తీవ్రంగా ఖండించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మరణించిన పలువురు యూఎస్‌ సైనికుల పవిత్రమైన స్థలాన్ని ట్రంప్‌ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ‘ఎక్స్‌’ వేదికగా మండిపడ్డారామె.

‘‘ ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటిక.. అమెరికన్ హీరోలను గౌరవించటానికి పవిత్రమైన ప్రదేశం. రాజకీయాలకు సంబంధించిన  స్థలం కాదు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ సైనికుల పవిత్రమైన స్థలాన్ని అవమానించారు. పోలిటికల్‌ స్టంట్‌ కోసం ట్రంప్‌ ఇలా చేశారు. ఇలా చేయటం ట్రంప్‌కు కొత్త కాదు. ఆయన దేశ సైనికులను ఓడిపోయినవారని పేర్కొన్నారు. ఇలా ఆయన ఎందుకు అన్నారో నాకు అర్థం కావటం లేదు. మెడల్‌ ఆఫ్‌ హానర్‌ గ్రహీతలను అవమానించారు. తనకు తాను సేవ చేసుకోవటం తప్ప మరొకటి తెలియని వ్యక్తి ట్రంప్‌. 

అమెరికన్లుగా మనమంతా ఏకీభవించాల్సిన  విషయం ఏమిటంటే..దేశానికి సేవచేసిన అనుభవజ్ఞులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులను గౌరవించాలి. ఎప్పుడూ అవమానించరాదు. అత్యున్నత గౌరవం, కృతజ్ఞత ఇచ్చేలా  చూడాలి. సైనికుల త్యాగాన్ని నేను ఎల్లప్పుడూ గౌరవిస్తాను. వారికి సంతాపం తెలియజేస్తున్నా. వారిని ఎప్పుడూ రాజకీయల కోసం ఉపయోగించుకోను’’ అని కమల అన్నారు.

 

సోమవారం ఆర్లింగ్టన్ నేషనల్ స్మశానవాటికను ట్రంప్‌ సందర్శించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మరణించిన పలువురు యూఎస్‌ సైనికులకు ఆయన నివాళులు అర్పించి, మృతుల కుటుంబసభ్యులతో ఫొటోలు దిగారు. అయితే అది కేవలం ప్రచారం కోసమే ట్రంప్‌ యూఎస్‌ సైనికులకు నివాళులర్పించేందుకు వచ్చారని యూఎస్‌ ఆర్మీ ఆరోపించిన విషయం తెలిసిందే. 

ఆర్మీ ఆరోపణలను ట్రంప్‌  తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్మశానవాటిను సందర్శించలేదని తెలిపారు. తాను ఎన్నికల్లో గెలవడానికి అలాంటి ప్రచారం అవసరం లేదని పేర్కొన్నారు.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)