Breaking News

కమలా హరీస్‌ ప్రచారంలో నిరసన.. ఆమె ఏమన్నారంటే?

Published on Thu, 08/08/2024 - 14:51

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి  కమలా హారిస్‌ దూసుకువెళ్తున్నారు. బుధవారం మిచిగాన్‌లోని రోమోలస్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అయితే ర్యాలీలో కొంత మంది గాజాపై జరుగుతున్న యుద్దానికి వ్యతిరేకంగా నిరననలు తెలుపతూ నినాదాలు చేశారు. ‘గాజాలో మారణహోమం’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

దీంతో విసిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ మాట్లాడుతూ.. ‘మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. అందుకు నేను ఇక్కడి వచ్చి  మీ ముందు ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించము అవసరమే. కానీ ప్రస్తుతం నేను మాట్లాడుతున్నా కదా’అని అన్నారు. అయినా కూడా కొంతమంది గాజా యుద్ధం గురించి నినాదాలు చేయటం కొనసాగించారు. దీంతో ఆమె ఒకింత అసహనానికి గురయ్యారు. ‘  అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో మీరు డొనాల్డ్‌ ట్రంప్‌​ విజయం సాధించాలని కోరుకుంటున్నారా. అలా అనుకుంటే నినాదాలు చేయండి. అలా కాకపోతే నేను మాట్లాడుతున్నాను వినండి’ అని అన్నారు. 

దీంతో నిరసన కారుల నుంచి నినాదాలు ఆగిపోయాయి.  మరోవైపు..  గాజా అంశంపై అధ్యక్షుడు వ్యవహారించిన తీరు తమకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం డెమోక్రట్లలో ఉందని స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇక.. మిచిగాన్‌ మొత్తం 15 ఎలక్టోరల్‌ ఓట్లను కలిగి ఉంది. 2020 ఎన్నికల్లో 15  ఎలక్టోరల్‌ ఓట్లు డెమోక్రటిక్‌ పార్టీకి పడ్డాయి. ఇక.. గతేడాది అక్టోబర్‌ 7న నుంచి గాజాపై ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకే  ఇజ్రాయెల్‌ దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి