Breaking News

ట్రంప్‌ విషయంలో అదే నిజమైంది.. అధ్యక్ష పోటీపై స్పందించిన కమలా హారిస్‌

Published on Sun, 10/26/2025 - 08:51

వాష్టింగన్‌: అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ కమలా హారిస్​ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను తప్పకుండా  ఏదో ఒకరోజు అమెరికాకు అధ్యక్షురాలిని కావచ్చు అని అన్నారు. భవిష్యత్తులో శ్వేతసౌధంలో ఓ మహిళా అధ్యక్షురాలు ఉంటుందన్న విశ్వాసం ఆమె వ్యక్తం చేశారు. దీంతో, ఆమె వ్యాఖ్యలపై అమెరికన్లు సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తాజాగా ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్ష పదవి కోసం నేను మరోసారి పోటీచేసే అవకాశం లేకపోలేదు. నా మనవరాళ్లు వారి జీవితకాలంలో కచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలిని చూస్తారు. బహుశా అది నేనే కావచ్చు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉందని భావిస్తున్నాను. వాస్తవానికి నేను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదు. నా కెరీర్ మొత్తాన్ని దేశ సేవలో గడిపాను. అది నా రక్తంలో ఉంది అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలనపై స్పందిస్తూ..‘ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ గురించి తాము చేసిన హెచ్చరికలు నిజమే అని ఇప్పుడు నిరూపితం అయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తే ఫాసిస్ట్‌లా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారని మేము ముందే చెప్పాం. మా అంచనా నిజమైంది. ట్రంప్​ న్యాయశాఖను ఆయుధంగా మలచుకుంటానని చెప్పారని, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు’ అని ఆరోపించారు.

ఇదిలా ఉండగా.. తదుపరి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి నిర్వహించిన పోల్స్‌లో డెమోక్రట్ల తరఫున ఆశావహుల రేసులో కమలా హారిస్​ వెనుకంజలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా, తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. ఒకవేళ ఇలాంటి పోల్స్‌ను పట్టించుకొని ఉంటే, తాను గత ఎన్నికల్లో పోటీపడేదాన్నే కాదని తెలిపారు. ఇక, గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి తరఫున ‍కమల పోటీచేసిన విషయం తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)