Breaking News

దూసుకుపోతున్న కమల.. ట్రంప్‌కు‌ గట్టి ఎదురుదెబ్బ!

Published on Fri, 09/06/2024 - 19:14

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు కమలా హారీస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఆసక్తికర పోటీ నడుస్తోంది. ప్రచారంలో కమలా హారీస్‌ దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు ట్రంప్‌పై కమల పైచేయి సాధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆగస్టులో ట్రంప్‌నకు వచ్చిన విరాళాల కంటే హారిస్‌ రెట్టింపు విరాళాలు సేకరించడం విశేషం.

కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక, తాజాగా ఆగస్టులో ట్రంప్‌నకు వచ్చిన విరాళాల కంటే హారిస్‌ రెట్టింపు విరాళాలు సేకరించడం గమనార్హం. ఇందులో భాగంగా కమలా హారీస్‌ ఆగస్టులో 30లక్షల మంది దాతల నుంచి 36.1కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు. ఇదే ఊపులో సెప్టెంబర్‌లో న్యూయార్క్‌, అట్లాంటా, లాస్‌ ఏంజిల్స్‌, శాన్‌ ఫ్రాన్సిస్కోలలో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు హారిస్‌ బృందం ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు.. ట్రంప్‌ మాత్రం కమలా హారీస్‌తో పోల్చుకుంటే కొంత వెనుకంజలో ఉన్నారు. ట్రంప్‌ ఆగస్టులో కేవలం 13కోట్ల డాలర్లను మాత్రమే సేకరించినట్లు ఆయన బృందం వెల్లడించింది. ఈ ‍క్రమంలో ట్రంప్‌ కంటే కమలకు.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ విరాళాలు వచ్చాయి. ఇక, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కమలా హారీస్‌ పూర్తి స్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా డెమోక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీలు ముమ్మర ప్రచారం చేస్తున్నాయి.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)