Breaking News

ట్రంప్‌లాంటోళ్లను చాలామందినే చూశా: కమలా హారిస్‌

Published on Fri, 08/02/2024 - 09:28

తమ జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలకు డెమోక్రాటిక్‌ అభ్యర్ధి కమలా హారిస్‌ కౌంటర్‌ ఇచ్చారు. ట్రంప్‌ ఎలాంటి వాడో తనకు ఎప్పుడో తెలుసని, ఆయన మళ్లీ పాత పాటే పాడుతున్నారంటూ ధీటుగా బదులిచ్చారు.

తన కెరీర్‌లో ట్రంప్‌ లాంటి వారెంతో మంది నేరస్థులతో వ్యవహరించినట్లు కమలా హారిస్‌ తెలిపారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవకముందు గతంలో అటార్నీ జనరల్‌, డిస్ట్రిక్ట్‌ అటర్నీ, కోర్టు ప్రాసిక్యూటర్‌గా ఉన్న సమయంలో ఇలాంటివెన్నో ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.

‘ట్రంప్‌ మళ్లీ తన పాతకాలపు విభజన సిద్ధాంతం, అగౌరవపర్చే ప్రవర్తననే ప్రదర్శిస్తున్నారు. అందుకే ఇలాంటివారు కాకుండా అమెరికా ప్రజలకు ఉత్తమ నాయకులు రావాలి. మన వైవిధ్యాలు మనల్ని విడదీయకూడదు. ఐకమత్యంగా ఉంచాలి. అదే మన బలం. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించేవారు మనకు వద్దు. వాస్తవాలను అంగీకరించి వాటిని ధైర్యంగా చెప్పే నాయకులు కావాలి’ అని వ్యాఖ్యానించారు.

 కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున పోటీలో దిగుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై జాతీపరమైన గుర్తింపుపై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఆమె భారతీయురాలా?.. లేక నల్లజాతీయురాలా?’అంటూ ప్రశ్నించారు. ఆమె ఎల్లప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే. ఇన్నాళ్లూ దాన్నే ప్రచారం చేస్తూ వచ్చారని విమర్శించారు.

ఆమె నల్లజాతీయురాలని కొన్నేళ్ల క్రితం వరకు తనకు తెలియదని, ఇప్పుడు ఆమె ఉన్నట్టుండి నల్లజాతీయురాలిగా మారిపోయారు. ఇంతకీ ఆమె భారతీయురాలా? నల్లజాతీయురాలా?’’ అని ట్రంప్‌ ప్రశ్నించారు. ఈ విమర్శలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

కాగా కమలా హారిస్ భారత సంతతికి చెందినవారన్న విషయం తెలిసిందే.  ఆమె తల్లి భారతీయురాలు,  తండ్రి జమైకన్. ఇద్దరూ యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చారు. అయతే కమలా  నల్లజాతి, ఆసియా వారసత్వం రెండింటినీ కలిగి ఉన్న తొలి అమెరికన్ ఉపాధ్యక్షురాలు. ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ  ఎన్నికల్లో హారిస్ గెలిస్తే దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు కానున్నారు..

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)