Breaking News

జోర్డాన్ యువరాజు బీఎండబ్ల్యూలో ప్రధాని మోదీ

Published on Tue, 12/16/2025 - 13:56

అమ్మాన్‌: ప్రధాని నరేంద్ర మోదీ.. కింగ్ అబ్దుల్లా- II ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ యువరాజు, మహమ్మద్ ప్రవక్త ప్రత్యక్ష వారసుడైన అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా- II ప్రధాని మోదీకి అరుదైన గౌరవం అందించారు. యువరాజు తన వ్యక్తిగత బ్లాక్‌ కలర్‌ బీఎండబ్ల్యూ కారులో ప్రధాని మోదీని స్వయంగా అమ్మాన్‌లోని జోర్డాన్ మ్యూజియంనకు తీసుకెళ్లారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను  చాటి చెప్పింది.

అమ్మాన్‌లోని రాస్ అల్-ఐన్‌లో ఉన్న జోర్డాన్ మ్యూజియం  పురావస్తు, చారిత్రక కళాఖండాలకు నిలయం. 2014లో నెలకొల్పిన ఈ మ్యూజియం జోర్డాన్ ప్రాంత సుదీర్ఘ నాగరిక ప్రయాణాన్ని వివరిస్తుంది. ఇక్కడ 1.5 మిలియన్ సంవత్సరాల నాటి జంతువుల ఎముకలు ఉన్నాయి. అత్యంత పురాతన విగ్రహాలలో ఒకటైన తొమ్మిదివేల ఏళ్లనాటి  ఐన్ ఘజల్ సున్నపు ప్లాస్టర్ విగ్రహాలు  ఉన్నాయి.ఈ మ్యూజియంను ప్రధాని మోదీ సందర్శించారు.
 

ప్రధాని మోదీ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదపడింది. ఈ సందర్భంగా భారతదేశం, జోర్డాన్‌లు పలు కీలక రంగాలలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి ఇండియా-జోర్డాన్ వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో కూడా ప్రసంగించారు. ఇరు దేశాలు వాణిజ్యం, వ్యాపారం, పెట్టుబడి సంబంధాలను పెంచగల రంగాలను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ మూడు దేశాల (జోర్డాన్, ఇథియోపియా,  ఒమన్) పర్యటనలో జోర్డాన్ మొదటి మజిలీ.

ఇది కూడా చదవండి: Bengal SIR list: ఎన్ని లక్షల పేర్లు తొలగించారంటే..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)