అమెరికన్లకు బైడెన్‌ హెచ్చరిక.. ఫేర్‌వెల్‌ స్పీచ్‌లో సంచలన కామెంట్స్‌

Published on Thu, 01/16/2025 - 07:49

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న వేళ జో బైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోందని అన్నారు. అలాగే,  కొద్దిమంది అతి సంపన్నుల చేతుల్లోనే అధికార కేంద్రీకరణ ఉండబోతుంది అంటూ హెచ్చరించారు. దీంతో, ఆయన కామెంట్స్‌ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మరో ఐదు రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి జో బైడెన్‌ దిగిపోనున్నారు. ఈ నేపథ్యంలో ఓవల్ కార్యాలయం నుండి తన వీడ్కోలు ప్రసంగం చేశారు బైడెన్‌. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ..‘నేడు అమెరికాలో విపరీతమైన సంపద, శక్తి  కలిగిన ఒక సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోంది. ఇది మొత్తం ప్రజాస్వామ్యాన్ని, మన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను హరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అమెరికా ప్రజలు తప్పుడు ప్రచారాలను చూడాల్సి ఉంటుంది. పత్రికా స్వేచ్ఛ క్షీణిస్తోందని హెచ్చరించారు. ఇది ఆందోళనకరంగా మారే ఛాన్స్‌ ఉందన్నారు.

ఇదే సమయంలో ఇది అధికార దుర్వినియోగానికి వీలు కల్పిస్తుందన్నారు. సోషల్‌ మీడియాలో అసత్య కథనాలు భారీగా స్థాయిలో వెలుగు చూస్తాయి. అధికారం కోసం నిజం అణిచివేయబడుతోందంటూ ఘాటు విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగాన్ని అదుపు చేయకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అలాగే, ప్రతీ అమెరికా పౌరుడు తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే పలు దేశాల అధినేతలకు ఆహ్వానం వెళ్లింది. దీంతో, పలువురు దేశాధినేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)