ట్రంప్‌తో డిబెట్‌.. అదో భయానక అనుభూతి: బైడెన్‌

Published on Sat, 07/06/2024 - 09:09

వాషింగ్టన్‌: ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ డిబెట్‌లో ట్రంప్‌ ధాటికి బైడెన్‌ తేలిపోయారు. ఈ నేపథ్యంలో చర్చ రోజున ఏం జరిగిందో బైడెన్‌ క్లారిటీ ఇచ్చారు. తాను భయంకరమైన అనుభూతికి లోనైనట్టు బైడెన్‌ చెప్పుకొచ్చారు.

కాగా, బైడెన్‌ తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ..‘ట్రంప్‌తో చర్చ రోజున నేను ఆనారోగ్యంతో ఉన్నాను. తీవ్రమైన జలుబు కారణంగా అస్వస్థతకు లోనయ్యారు. అది నాకు భయంకరమైన అనుభూతి. అనారోగ్యం కారణంగానే నేను బాగా మాట్లాడలేకపోయాను. కానీ, నేను రేసులో ఉన్నాను. ట్రంప్‌ను కచ్చితంగా ఓడించగలను’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ట్రంప్‌తో చర్చలో భాగంగా బైడెన్‌ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ చర్చలో ట్రంప్‌ పైచేయి సాధించాడని పలు మీడియా సంస్థలు కూడా పేర్కొన్నాయి. దీంతో, ఎన్నికల నుంచి బైడెన్‌ తప్పుకోవాలనే చర్చ మొదలైంది. కానీ, వైట్‌ హౌస్‌ వర్గాలు మాత్రం బైడెన్‌ రేసులో ఉంటారని చెప్పుకొచ్చాయి. ఇక, బైడెన్‌ కూడా తాను పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు. 

 

మరోవైపు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారపర్వంతో అలసిపోతున్నారట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారు. తాను నిద్రపోవడానికి మరింత సమయం కావాలని, రాత్రి ఎనిమిది తర్వాత ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి కార్యక్రమాలు వద్దని చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో బైడెన్‌ తెలిపారు. 

డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో బైడెన్ తడబడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన తడబాటుకు గల కారణాన్ని బైడెన్‌ ఇదివరకే వెల్లడించారు. తన సిబ్బంది ఎంత వారించినా చర్చకు ముందు తాను పలు విదేశీ పర్యటనలకు వెళ్లానని తెలిపారు. దాని వల్ల వచ్చిన అలసట కారణంగానే వేదికపై దాదాపు నిద్రపోయినంత పనైందని పేర్కొన్నారు. అందుకే చర్చలో సరిగా వాదించలేకపోయినట్లు చెప్పారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)