Breaking News

భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌..!

Published on Thu, 01/05/2023 - 05:47

వాషింగ్టన్‌ : భారత్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్‌ గార్సెట్టిని (51) అధ్యక్షుడు జో బైడెన్‌ పునర్నియమించారు. ఎరిక్‌ నియామకాన్ని అమెరికా కాంగ్రెస్‌లో సెనేట్‌ ఆమోదించాల్సి ఉంది. లాస్‌ ఏంజెల్స్‌ మాజీ మేయర్‌ అయిన ఎరిక్‌ గార్సెట్టి బైడెన్‌కు అత్యంత సన్నిహితుడు. గతంలో 2021 జులైలో ఎరిక్‌ను భారత రాయబారిగా నియమించినప్పుడు అప్పట్లో రిపబ్లికన్‌ సెనేటర్‌ చక్‌ గ్రాసిటీ అడ్డుకున్నారు.

మరోవైపు తన పాలనా విభాగంలోని కీలక పదవుల్లో అరడజనుకిపైగా ఇండియన్‌ అమెరికన్లను బైడెన్‌ మంగళవారం రీ నామినేట్‌ చేశారు. బైడెన్‌ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ రిసోర్సెస్‌ పదవికి రిచర్డ్‌ వర్మ, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు ప్రతినిధిగా డాక్టర్‌ వివేక్‌ హాలెగెరె మూర్తి (45)ని రీ నామినేట్‌ చేస్తూ సెనేట్‌ ఆమోదానికి పంపించారు. వీరే కాకుండా ప్రవాస భారతీయులైన అంజలి చతుర్వేది, రవి చౌధరి, గీతా రావు గుప్తా, రాధా అయ్యంగార్‌లను ప్రభుత్వంలో వివిధ పదవులకు రీ నామినేట్‌ చేస్తూ సెనేట్‌కు పంపించారు.
 

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)