హమాస్‌ చీఫ్‌ సిన్వర్‌ మృతి.. బైడెన్‌ స్పందన ఇదే..

Published on Fri, 10/18/2024 - 08:09

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ మృతి చెందాడు. ఈ క్రమంలో సిన్వర్‌ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ఇది ఎంతో శుభసూచకం. సిన్వర్‌ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇజ్రాయెల్‌, గాజా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇ​జ్రాయెల్‌ హతమార్చింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశాం. బంధీలను సురక్షితంగా తరలించే వరకు యుద్ధం మాత్రం ఆగదు అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో విదేశాంగమంత్రి కాంట్జ్‌ మాట్లాడుతూ.. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయం. ఇరాన్‌ నేతృత్వంలో రాడికల్‌ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయం ఇది. సిన్వర్‌ మృతిలో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని చెప్పుకొచ్చారు.

మరోవైపు, సిన్వర్‌ మృతిపై జో బైడెన్‌ స్పందిస్తూ.. హమాస్‌ అ‍గ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టడం యావత్‌ ప్రపంచానికి శుభదినం. ఈ ఘటన హమాస్‌ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధం ముగింపునకు దోహదపడుతుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్‌ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్‌, డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి హమాస్‌ నేత మరణాన్ని ధ్రువీకరించింది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 దాడుల సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్‌ బలంగా నమ్ముతోంది. గతేడాది ఇజ్రాయెల్‌ సరిహద్దులపై హమాస్‌ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్‌ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు.

ఇది కూడా చదవండి: బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హాసీనాపై అరెస్ట్‌ వారెంట్‌

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)