​Hamas: అమెరికా బందీ మృతి.. బైడెన్‌ కీలక ప్రకటన

Published on Sat, 12/23/2023 - 11:43

వాషింగ్టన్‌: హమాస్‌ చెరలో బందీగా ఉన్న తమ దేశ పౌరుడు  గాడి హగ్గాయ్‌ మరణించాడన్న వార్తతో తన గుండె పగిలిపోయిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు. హగ్గాయ్‌ మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైట్‌హౌజ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. 

‘హగ్గాయ్‌ గాజాలో హమాస్‌ చెరలోనే చనిపోయాడని తెలిసిన వెంటనే నా, నాభార్య జిల్‌ బైడెన్‌ హృదయాలు తీవ్ర విషాదంతో నిండిపోయాయి. హమాస్‌ వద్ద బందీగా ఉన్న హగ్గాయ్‌ భార్య క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూనే ఉంటాం’ అని జో బైడెన్‌ పేర్కొన్నారు. హగ్గాయ్‌ భార్య ఇప్పటికీ హమాస్‌ చెరలోనే బందీగా ఉందని ఇజ్రాయెల్‌ మీడియా తెలిపింది. 

గాజాలో హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలకు  ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక గ్రూపు హగ్గాయ్‌ మరణాన్ని ధృవీకరించింది. అయితే ఆయన ఎందుకు చనిపోయాడన్న కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద గ్రూపు హమాస్‌ మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే.

బాంబు దాడులతో పాటు గాజా సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్‌లోని ప్రాంతం నుంచి కొంత మందిని హమాస్‌ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. అప్పటి నుంచి హమాస్‌ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ బాంబులతో విరుచుకుపడుతూనే ఉంది.  

ఇదీచదవండి..గుడి గోడలపై ఖలిస్తానీ నినాదాలు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)