Breaking News

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్‌

Published on Mon, 07/20/2026 - 08:27

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ఆయన భార్య ఉషా వాన్స్‌ దంపతుల ఇంట్లో కొత్త ఆనందం వెల్లివిరిసింది. ఉషా వాన్స్‌ నాలుగో సంతానానికి జన్మనిచ్చారు. పుట్టింది మగ బిడ్డ అని, అతడికి ‘అలెక్‌ నీల్‌ వాన్స్‌’ అని పేరు పెట్టినట్లు జేడీ వాన్స్‌ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి? ముఖ్యంగా భారతీయ మూలాలున్న ఉషా వాన్స్‌ కుటుంబ నేపథ్యంతో ‘నీల్‌’ పేరుకు ఏమైనా సాంస్కృతిక అనుబంధం ఉందా? అనే ఆసక్తి నెలకొంది.

జేడీ వాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా శుభవార్తను పంచుకున్నారు. “ఉషా, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా పిల్లలు తమ చిన్ని తమ్ముడిని కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు” అంటూ ఆయన పేర్కొన్నారు. బిడ్డకు వైద్యం అందించిన వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలిటరీ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆ పేరుకు అర్థం ఏంటంటే.. 
వాన్స్‌ దంపతులు తమ నాలుగో బిడ్డకు పెట్టిన అలెక్‌ నీల్‌ వాన్స్‌(Alec Neel Vance) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలెక్‌ (Alec) అనేది సాధారణంగా అలెగ్జాండర్‌ (Alexander) అనే పేరుకు సంక్షిప్త రూపంగా భావిస్తారు. గ్రీకు మూలాలున్న ఈ పేరుకు “రక్షకుడు”, “ప్రజలను కాపాడేవాడు” అనే అర్థాలు ఉన్నాయి.

ఇక నీల్‌ (Neel) అనే పేరు భారతీయులకు సుపరిచితమైనది. సంస్కృతంలోని “నీల” అనే పదం నుంచి వచ్చిన ఈ పేరుకు నీలం రంగు, ఆకాశం, నీలి వర్ణం వంటి అర్థాలు ఉన్నాయి. భారత్‌లో ఈ పేరును ఎంతోమంది ఉపయోగిస్తారు. అయితే జేడీ వాన్స్‌, ఉషా వాన్స్‌లు ఈ పేరును ప్రత్యేకంగా భారతీయ మూలాలతో పెట్టారా? లేదంటే కుటుంబానికి సంబంధించిన మరేదైనా కారణం ఉందా? అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయినప్పటికీ ఉషా వాన్స్‌ భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో.. ‘నీల్‌’ పేరు సాంస్కృతికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆరుగురితో వాన్స్‌ కుటుంబం
అలెక్‌ రాకతో జేడీ వాన్స్‌, ఉషా వాన్స్‌ల కుటుంబం ఆరుగురు సభ్యులుగా మారింది. ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఈవాన్‌ (Ewan) 2017లో జన్మించాడు. రెండో కుమారుడు వివేక్‌ (Vivek) 2020లో జన్మించగా.. కుమార్తె మిరాబెల్‌ (Mirabel) 2021లో జన్మించింది. ఇప్పుడు అలెక్‌ కుటుంబంలో నాలుగో చిన్నారి సభ్యుడిగా చేరాడు.

నాలుగో బిడ్డ కోసం ఆసక్తికర కథ
నాలుగో సంతానం విషయంలో జేడీ వాన్స్‌ గతంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు తన భార్య ఉషాతో ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలిపారు. “నాకు నాలుగో బిడ్డ కావాలని ఉషాతో చెప్పాను. అందుకు ఆమె.. ‘సరే.. కానీ నువ్వు అమెరికా ఉపాధ్యక్షుడవుతావా? లేక నాలుగో బిడ్డను పొందుతావా? రెండూ ఒకేసారి సాధ్యం కాదు’ అని చెప్పింది” అంటూ వాన్స్‌ సరదాగా వ్యాఖ్యానించారు. చివరకు తనకు ఉపాధ్యక్ష పదవి, నాలుగో బిడ్డ రెండూ లభించాయని ఆయన అన్నారు.

ఉషా వాన్స్‌కు ఆంధ్రా మూలాలు
జేడీ వాన్స్‌ భార్య ఉషా వాన్స్‌ భారతీయ మూలాలున్న అమెరికన్‌. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు కుటుంబ నేపథ్యానికి చెందినవారు. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వారు అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో పెరిగిన ఉషా.. చిన్ననాటి నుంచే అమెరికా వాతావరణంలో పెరిగినా, కుటుంబం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగించారు.

అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్‌ లా స్కూల్‌ (Yale Law School)లో న్యాయ విద్య అభ్యసిస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2013లో న్యాయ విద్య పూర్తి చేసి, 2014లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాలను కలిపి వివాహం చేసుకున్నారు.

అత్తగారి కుటుంబంపై ప్రశంసలు
జేడీ వాన్స్‌ గతంలో పలుమార్లు తన భార్య ఉషా కుటుంబం గురించి ప్రస్తావించారు. భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తన అత్తమామలు అమెరికా సమాజానికి ఎంతో సేవ చేశారని, కష్టపడి తమ స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)