Breaking News

డెన్మార్క్‌ను వదిలేయండి..  అమెరికాతో ఒప్పందం చేసుకోండి 

Published on Sun, 03/30/2025 - 06:30

గ్రీన్‌లాండ్‌:  ఆర్కిటిక్‌ ద్వీప దేశమైన గ్రీన్‌లాండ్‌పై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్‌ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. చైనా, రష్యాలకు గ్రీన్‌లాండ్‌ను అప్పగించాలన్నదే డెన్మార్క్‌ ఆలోచనగా కనిపిస్తోందని మండిపడ్డారు. అందుకే అమెరికాతో ఒక ఒప్పందానికి వస్తే బాగుంటుందని గ్రీన్‌లాండ్‌ ప్రజలకు సూచించారు. జె.డి.వాన్స్‌ శుక్రవారం తన భార్య ఉషా వాన్స్‌తో కలిసి గ్రీన్‌లాండ్‌లో పర్యటించారు. డెన్మార్క్‌తో సంబంధాలు తెంచుకోవాలని గ్రీన్‌లాండ్‌ పౌరులకు పిలుపునిచ్చారు. మిమ్మల్ని రక్షించే పరిస్థితిలో డెన్మార్క్‌ లేదని అన్నారు. 

ఇతర దేశాల ఆక్రమణల నుంచి గ్రీన్‌లాండ్‌ను కాపాడే సత్తా అమెరికాకు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. గ్రీన్‌లాండ్‌ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తున్నామని చెప్పారు. గ్రీన్‌లాండ్‌ భద్రతతోనే అమెరికా భద్రత ముడిపడి ఉందన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకుంటామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్‌ ప్రజలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్‌లాండ్‌లో 57 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. వీటిపై డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నేశారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)