Breaking News

‘అతిథే కాదు లగేజీ దేవోభవ’.. 30 ఏళ్లలో ఒక్క బ్యాగూ మిస్సవని విమానాశ్రయం

Published on Tue, 07/22/2025 - 10:51

టోక్యో: ప్రపంచంలోని ఏ విమానాశ్రయానికీ దక్కని ఘనతను జపాన్‌లోని ఆ విమానాశ్రయం సొంతం చేసుకుంది. అదే కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (కిక్స్‌). గడచిన 30 ఏళ్లలో ఈ విమానాశ్రయంలో ఒక్క లగేజీ కూడా మిస్‌ కాలేదంటే ఒక పట్టాన నమ్మలేం.. కానీ ఇది ముమ్మాటీకీ నిజం. 2024లో  ఈ విమానాశ్రయం ప్రపంచంలోని ఉత్తమ లగేజీ డెలివరీ విమానాశ్రయంగా గుర్తింపు పొందుతూ మరోమారు ‘స్కైట్రాక్స్’ అవార్డును దక్కించుకుంది.

ఒసాకాలోని ఈ కన్సాయ్ విమానాశ్రయం 1994లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఇది ఏటా మూడు కోట్ల ప్రయాణికులకు సేవలు అందిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ విమానాశ్రయం ఎనిమిది సార్లు ‘స్కైట్రాక్స్’ అవార్డును గెలుచుకుంది. లగేజీ పికప్‌కు ముందు వేచి ఉండే సమయం, లగేజీ డెలివరీ సామర్థ్యం, పోగొట్టుకున్న లగేజీల ఆధారంగా వివిధ గణాంకాలు సేకరించి, ఈ అవార్డును అందజేస్తారు.  ఈ విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు  కోటి లగేజీలను అందజేసింది.

కిక్‌ విమానాశ్రయం ట్రాక్ రికార్డ్‌ ఇంత విజయవంతం కావడానికి కారణం  ఇక్కడి ‘మల్టీలేయర్డ్ చెకింగ్ వర్క్’. ప్రతి బ్యాగేజీని పరిరక్షించేందుకు విమానాశ్రయ విభాగం ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించింది. తప్పులను, పొరపాట్లను నివారించేందుకు బహుళ సిబ్బంది సమాచారాన్ని పంచుకోవడం చాలా ముఖ్యమని లగేజీ కార్యకలాపాలను పర్యవేక్షించే సుయోషి హబుటా నిక్కీ తెలిపారు. విమానం వచ్చిన 15 నిమిషాలలోపు  ప్రయాణికుల లగేజీలను వారికి అందించడం వారి లక్ష్యంగా ఈ విమాశ్రయ సిబ్బంది పనిచేస్తుంటారు. జపాన్‌ ప్రజలు అనుసరించే ఆతిథ్య కళ ‘ఓమోటేనాషి’ని ఇక్కడి సిబ్బంది ఆకళింపు చేసుకున్నారు. 

ప్రయాణికుల లగేజీని వారికి అందించడమనేది ఒక హామీ అని వారు నమ్ముతారు. ఇక్కడి ప్రతి సూట్‌కేస్‌ను ఇటు డిజిటల్ పద్దతిలో, అటు భౌతికంగానూ డ్యూయల్ ట్యాగింగ్ సిస్టమ్‌తో ట్రాక్ చేస్తారు. ఫలితంగా ఏ బ్యాగు కూడా మిస్సయ్యే అవకాశం ఉండదు. ఇక్కడి సిబ్బందికి లాజిస్టిక్స్‌లో మాత్రమే కాకుండా మానవ తప్పిదాలను ఊహించడంలోనూ శిక్షణ అందిస్తారు. బ్యాగేజీ విషయంలో అవకతవకలు జరిగితే, బ్యాగ్ విమానం నుండి బయటకు వెళ్లే ముందే హెచ్చరిక వ్యవస్థ అప్రమవుతుంది. పర్యాటకులు ఈ విమానాశ్రయాన్ని ‘ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా గౌరవించే విమానాశ్రయం’ అని ప్రశంసిస్తుంటారు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)