ఫిబ్రవరి 8న జపాన్‌లో ఎన్నికలు

Published on Tue, 01/20/2026 - 06:22

టోక్యో: జపాన్‌ ప్రధానమంత్రి సనే తకాయిచీ అనూహ్య నిర్ణయం తీసుకు న్నారు. పార్లమెంట్‌ను రద్దు చేసి, తక్షణమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం టోక్యోలో జరిగిన మీడియా సమావేశంలో తకాయిచీ ఈ విషయం ప్రకటించారు. పార్లమెంట్‌లోని శక్తివంతమైన దిగువ సభను ఈ నెల 23వ తేదీన రద్దు చేస్తానని వెల్లడించారు. 

ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు నిర్వహించడం ద్వారా తమకున్న ప్రజామద్దతును దిగువ సభలో అత్యధిక మెజారిటీ సాధించేలా మల్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఇది అత్యంత కఠినమైన నిర్ణయం. ప్రజలతో కలిసి జపాన్‌ పురోగమనాన్ని ఖరారు చేసే నిర్ణయం. తకాయిచీ ప్రధాని పదవికి అర్హురాలా, కాదా? అన్నది ప్రజలు తేల్చే నిర్ణయం’అని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది అక్టోబర్‌ 21వ తేదీన దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తకాయిచీకి, ఆమె కేబినెట్‌కు ప్రజల మద్దతు ఉంది. 

అయితే, ఆమె లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ(ఎల్‌డీపీ) మాత్రం ప్రజాదరణలో వెనుకబడింది. అయిదేళ్ల కాలంలో ప్రధానిగా పీఠం ఎక్కిన నాలుగో ఎల్డీపీ నేత తకాయిచీ. దీంతో, ఆకస్మిక ఎన్నికల వ్యూహం ఏమేరకు ఫలిస్తుందన్నది తెలియాల్సి ఉంది. దిగువ సభలోని 465 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించిన ప్రచారం ఈ నెల 27వ తేదీ నుంచి మొదలుకానుంది. 1955 నుంచి జపాన్‌లో అత్యధిక కాలం ఎల్డీపీయే అధికారంలో ఉంది. ఈ పార్టీకి దిగువ సభలో 199 మంది సభ్యుల బలముంది. మాజీ ప్రధాని షింజో అబే శిష్యురాలిగా తకాయిచీకి పేరుంది. షింజో అబే తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలుగా తకాయిచీ నిలిచారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)