Breaking News

ఎస్క్‌లేటర్‌పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి?

Published on Tue, 10/10/2023 - 07:17

సాంకేతికత పరంగా ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో జపాన్ ఒకటి. అయితే  ఈ దేశంలోని ఒక నగరంలోని జనం ఎస్క్‌లేటర్లపై నడవడంపై నిషేధం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎస్క్‌లేటర్లపై ఎవరైనా నడిస్తే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. 

ఈ విషయం తెలిశాక ప్రజారోగ్యం దృష్ట్యా ఇలా చేసి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే జనం మెట్లను ఎక్కువగా ఉపయోగించాలి. వారంతా ఫిట్‌గా ఉండాలనే ఆలోచనతో ఇలా చేసివుంటారని అనుకుంటారు. అయితే ఇలా అనుకోవడంలో అస్సలు నిజం లేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 

జపాన్ టుడే తెలిపిన వివరాల ప్రకారం నగోయా నగరం ఈ చట్టాన్ని చేసింది. 2023, అక్టోబర్ 1 నుంచి ఇక్కడ ఎస్క్‌లేటర్లపై నడవడంపై నిషేధం విధించారు. ఎస్కలేటర్ల నుండి పడిపోకుండా జనాన్ని రక్షించడం, ఈ తరహా ప్రమాదాలను నివారించడమే దీని ఉద్దేశ్యం. జపాన్‌లో ఎస్క్‌లేటర్‌ వినియోగంలో ఒక నియమం ఉంది. ప్రజలు ఎస్క్‌లేటర్ల ఎడమ వైపున నిలబడాలి. తద్వారా జనం త్వరగా ఎక్కడానికి లేదా దిగడానికి కుడి వైపున ఉన్న మార్గం తెరిచి ఉంటుంది. 

ఎస్క్‌లేటర్లు వినియోగించేవారు భయాందోళనలకు గురైనపుడు ఇతరులను నెట్టడంలాంటివి జరుగుతుంటాయి. ఫలితంగా పలువురు గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. వృద్ధులు, వికలాంగులను ఇలాంటి ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ నియమం అమలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగోయా నగరంలో ఎస్క్‌లేటర్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి. 

జపాన్ ఎలివేటర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2018-2019 సంవత్సరంలో 805 ఎస్క్‌లేటర్ల ప్రమాదాలు సంభవించాయి. ఎస్క్‌లేటర్ల దుర్వినియోగం కారణంగానే ఇలా జరిగినట్లు తేలింది. అప్పటి నుంచి అధికారులు ఎస్క్‌లేటర్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు 2021 అక్టోబర్‌లో సైతామా నగరంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేశారు. అయితే దానికి చట్టరూపమివ్వలేదు. తాజాగా ఎస్క్‌లేటర్ల వినియోగంపై నగోయా నగరం ఒక చట్టాన్ని రూపొందించింది. ఎస్కలేటర్ల వాడకం మానేయాలని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రధాన రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ప్రకటనల బోర్డులు ఏర్పాటుచేశారు. 
ఇది కూడా చదవండి: హర్దీప్‌ నిజ్జర్‌ హత్య వెనుక చైనా హస్తం?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)